Anchor Suma House : బుల్లితెర ప్రేక్షకులకి పరిచయం అక్కర్లేని పేరు సుమ. కొన్ని దశాబ్ధాలుగా తన యాంకరింగ్‌తో ప్రేక్షకులని అలరిస్తూ వస్తుంది. ఏ షో చూసినా, ఈవెంట్ చూసినా సుమ తప్పక కనిపిస్తుంది.. ఆమె ఒక మాటల మాంత్రికురాలు. ఓవైపు ఇండస్ట్రీలో తన కెరీర్ ని మంచిగా రాణిస్తూనే మరోవైపు ఫ్యామిలిని కూడా మంచిగా లీడ్ చేస్తుంది సుమ. నటిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సుమ హీరోయిన్‌గా మాత్రం సక్సెస్ కాలేకపోయింది. అలా యాంకర్ గా ఎంట్రీ ఇచ్చి తిరుగులేని యాంకర్ గా పేరు సంపాదించింది. ఇటీవల సుమ జయమ్మ పంచాయతీ సినిమాలో నటిగా రీ ఎంట్రీ ఇచ్చిన పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
సుమ ఇటీవల సోషల్ మీడియాలోను చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన ఇంటిని , ఫ్యామిలీకి సంబంధించిన పలు విషయాలని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సందడి చేస్తూ ఉంటుంది. సుమ ఎంతో ఇష్టపడి కట్టుకున్న ఇంటికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఎన్నో సినిమాలు సుమ ఇంట్లోనే షూటింగ్ చేసినట్లుగా ఇటీవల వార్తలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ లో ఏ ఏ సినిమాలో సుమ ఇంట్లో సందడి చేశాయో తెలుసా… నాగచైతన్య, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన 100% లవ్ సినిమా షూటింగ్ ఎక్కువగా సుమ ఇంట్లోనే జరిగిందట. ఇక ఎన్టీఆర్, శ్రీనువైట్ల కాంబినేషన్లో వచ్చిన బాద్ షా సినిమా లో కాజల్ అగర్వాల్ ఇల్లు సుమ ఇల్లేనట.
బ్రూస్ లీ సినిమా లో రామ్ చరణ్ ఇల్లుగా కూడా సుమ ఇంటినే వాడారు. మహేష్ బాబు నటించిన దూకుడు సినిమాలో మహేష్ బాబు- ప్రకాష్ రాజ్ ఉన్న ఇల్లు, సునీల్ నటించిన పూలరంగడు సినిమాలో విలన్ ఇల్లు కూడా సుమ ఇల్లేనట. ఇలా చాలా సినిమాల్లో షూటింగ్ లకు సుమ ఇంటిని వాడినట్టు తెలుస్తుంది. సుమ ఇల్లు చాలా అందంగా ఉండడంతో పాటు సినిమా షూటింగ్ కు చాలా అనుగుణంగా ఉన్న నేపథ్యంలో ఆమె ఇంటిని షూటింగ్‌కి వాడారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…