గురువారం, జూన్ 11, 2026
వినోదం

Ravi: స‌హ‌నం న‌శించ‌డంతో పోలీస్ స్టేష‌న్‌కి వెళ్లిన యాంక‌ర్ ర‌వి..!

Ravi: బుల్లితెర‌పై త‌న‌దైన మాట‌ల‌తో ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదం పంచిన యాంక‌ర్ ర‌వి. ఈయ‌న బిగ్ బాస్ సీజ‌న్ 5 కార్య‌క్ర‌మంలో సంద‌డి చేశారు. ఈ షో ర‌వికి పాజిటివిటీ క‌న్నా నెగెటివిటీనే ఎక్కువ‌గా పంచింది అని చెప్పాలి.…

Ravi: స‌హ‌నం న‌శించ‌డంతో పోలీస్ స్టేష‌న్‌కి వెళ్లిన యాంక‌ర్ ర‌వి..!

Ravi: బుల్లితెర‌పై త‌న‌దైన మాట‌ల‌తో ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదం పంచిన యాంక‌ర్ ర‌వి. ఈయ‌న బిగ్ బాస్ సీజ‌న్ 5 కార్య‌క్ర‌మంలో సంద‌డి చేశారు. ఈ షో ర‌వికి పాజిటివిటీ క‌న్నా నెగెటివిటీనే ఎక్కువ‌గా పంచింది అని చెప్పాలి. రవి కావాలని అన్నింట్లో తలదూర్చుతున్నాడని, ఇన్‌ఫ్లూయెన్స్‌ చేస్తున్నాడంటూ నానామాటలు అన్నారు. అత‌నినే కాదు రవి భార్య నిత్య, కూతురు వియాని కూడా దూషించారు.

Ravi gone to police statin and complained

బయటకు వచ్చిన రవి తనమీద, తన కుటుంబం మీద జరుగుతున్న ట్రోలింగ్‌ను చూసి తట్టుకోలేకపోయాడు. నన్ను నెగెటివ్‌గా చూపించారు అని మొత్తుకుంటున్నా కొందరు నెటిజన్లు అతడిని విమర్శించడం మానుకోలేదు. తను సిరికి సపోర్ట్‌ చేయడాన్ని సహించలేకపోయిన కొందరు రవి కూతుర్ని కూడా మధ్యలోకి లాగారు. దీంతో ఓపిక నశించిన రవి సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించాడు.

తన పై ఎన్ని రకాల కామెంట్స్ చేసినా పట్టించుకోని రవి.. తన కుటుంబసభ్యుల గురించి అసభ్యకరంగా కామెంట్స్ చేయడంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సోషల్ మీడియాలో తనను ఉద్దేశించి చేసిన ప్రతి బ్యాడ్ కామెంట్ కు సమాధానం చెప్పాల్సిందే అని రవి అంటున్నారు. ఇక యాంకర్ రవి పోలీసులను ఆశ్రయించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొంతకాలం కుటుంబంతో కలిసి హాలిడేకి వెళ్లిన రవి ఇటీవలే తిరిగి వచ్చాడని తెలుస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి