Bigg Boss 5 : నా కొడుకుని ఎన్‌కౌంట‌ర్ చేశారు.. రవి తల్లి షాకింగ్ కామెంట్స్..

December 10, 2021 5:05 PM

Bigg Boss 5 : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న బిగ్ బాస్ షోపై ప్ర‌శంస‌ల‌తోపాటు విమ‌ర్శ‌లు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఇప్ప‌టికే ఈ షో గురించి శ్రీ రెడ్డి, మాధ‌వీల‌త వంటి వారు విమ‌ర్శ‌లు ఎక్కుపెట్ట‌గా, రీసెంట్‌గా యాంక‌ర్ ర‌వి త‌ల్లి కూడా ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. కావాలని పిలిచి తీసుకెళ్లారు. కానీ ఆ హోదా ఇవ్వలేదు. మీరు ఇచ్చేది ఏంటి.. వీళ్లు ఇస్తున్నారు చాలు. అది రెస్పెక్ట్‌ అంటే.. అంటూ అక్కడే ఉన్న ఫ్యాన్స్‌ను చూపించింది. ప్ర‌స్తుతం ర‌వి త‌ల్లికి సంబంధించిన వీడియో వైర‌ల్‌గా మారింది.

Bigg Boss 5 anchor ravi mother sensational comments

ర‌వి ఎలిమినేట్‌ అయి బయటకు వచ్చిన అనంతరం అతడి ఫ్యాన్స్‌ డ్యాన్స్‌ డీజేతో గ్రాండ్‌గా వెల్‌కం చెప్పారు. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన మీడియాతో రవి తల్లి ఉమా రాణి నా కొడుకు ప్రెషర్‌ కుక్కర్‌ నుంచి బయట పడినట్టు ఉందని చెప్పింది. అంతేగాక రవిని వాళ్లు ఎన్‌కౌంటర్‌ చేసినట్టు అనిపిస్తోందంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది. ‘నా కొడుకు టాప్‌ 5లో ఉండాల్సిన వాడు ఇలా ఎలిమినేట్‌ అవడం ఆశ్చర్యంగా ఉంది. అతడు గేమ్‌ ఆడాడు. పిచ్చి చేష్టలు చేసి రాలేదు. ఊరికే కూర్చోని తినలేదు. రవి గేమర్‌. తెలివిగా ఆడాడు.. అని చెప్పుకొచ్చింది.

‘సెలబ్రెటీలను పట్టుకు తీసుకెళ్లి మేకల్లా, గొర్రెల్లా ఉంచారు. అదే ఇండస్ట్రీలో ఉంటూ సేమ్‌ ఇండస్ట్రీ వారిని అవమానిస్తున్నారు. రవి అనే కాదు ప్రతి కంటెస్టెంట్‌కు ఇది ఫెయిర్‌ కాదు. ఇది ఎప్పటికీ సరైనది కాదు. ఇప్పటికైనా కాన్సెప్ట్‌ మార్చండి. లేకపోతే బిగ్‌బాస్‌ ఎవరూ చూడరు.. అంటూ రవి తల్లి ఉమరాణి బిగ్‌బాస్‌పై మండిపడింది. ఈ వీడియోపై ప‌లువురు పాజిటివ్‌గానే స్పందిస్తున్నారు. కాగా, ర‌వి త‌ల్లి బిగ్ బాస్ వేదిక‌గా త‌న కుమారుడిపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించిన విష‌యం తెలిసిందే.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now