Anasuya : బాధ‌తో కేటీఆర్ ట్వీట్.. అన‌సూయ రిప్లైపై తెగ ట్రోల్స్

December 4, 2023 5:30 PM

Anasuya : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎగ్జిట్ పోల్ట్ అంచనాలను నిజం చేస్తూ కాంగ్రెస్ పార్టీ విజ‌య ఢంకా మోగించ‌డం మ‌నం చూసాం. కాంగ్రెస్ పార్టీ పూర్తి ఆధిక్యాన్ని సాధించి కొత్త ప్ర‌భుత్వం ఏర్పాటుకి సిద్ధ‌మైంది. అయితే ప‌దేళ్ల‌పాటు అధికారంలో ఉన్న‌బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఓట‌మి చెంద‌డంతో కార్య‌క‌ర్త‌లు, ప‌లువురు నాయ‌కులు తీవ్ర నిరాశ‌లో ఉన్నారు. ఓటమి త‌ర్వాత‌ కేటీఆర్ తమకు రెండుసార్లు అవకాశమిచ్చిన ప్రజలకు ధన్యవాదాలు చెబుతూ, కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు చెప్పారు. కేటీఆర్ చేసిన ఈ ట్వీట్‌పై బుల్లితెర యాంకర్ అనుసూయ స్పందించారు.

‘మీరు నిజమైన నాయకుడు సర్… ఎందరికో స్ఫూర్తినిస్తున్నారు. మన రాష్ట్ర స్థితిని అవతలి వైపు నుంచి చూడాల్సిన అవసరం ఉండవచ్చు. బలమైన ప్రతిపక్షంగా మీరు కూడా చేయాల్సింది ఉంటుంది. ప్రతిపక్ష నేతగా మీరు చేయాల్సింది చేస్తారని ఆశిస్తున్నాను. హైదరాబాద్‌ను అద్భుతంగా తీర్చిదిద్ది ఈ నగరంతో ప్రేమలో పడేలా చేసినందుకు ధన్యవాదాలు’ అని ట్వీట్ చేశారు. అయితే అన‌సూయ ట్వీట్‌పై కొంద‌రు నెటిజ‌న్స్ తెగ ట్రోల్ చేస్తున్నారు. థాంక్యూ ఆంటీ, చెప్పింది చాలులే కానీ, అభివృద్ధి అంటే హైదరాబాద్ ఒక్కటి చేస్తే చాలదు ఆంటీ, పెయిడ్ ఆర్టిస్ట్, అసలు నువ్వు ఓటేశావా అంటూ నెటిజన్లు ఆమెపై తెగ ఫైర్ అవుతున్నారు.

Anasuya being trolled by netizen for replying to ktr
Anasuya

ఈ సారి ఎన్నిక‌ల‌లో చాలా మంది సెల‌బ్రిటీలు ఎన్నిక‌ల ఓటింగ్‌లో పాల్గొన్నారు. అన‌సూయ కూడా ఓటు వేసి అందుకు సంబంధించిన ఫొటో షేర్ చేసింది. మ‌రోవైపు టీవీ యాంకర్లు, బిగ్‌బాస్ సెలబ్రెటీలు, బిత్తిరి సత్తి సహా చాలా మంది ఈ సారి బీఆర్‌ఎస్ పార్టీకి ప్రచారం కూడా చేశారు. సోషల్ మీడియాలో రోజుకో వీడియో చేసి గట్టిగానే ప్రమోషన్ చేశారు. కానీ ఎవరు ఎన్ని చేసినా ఈసారి మాత్రం తెలంగాణ ప్రజలు మాత్రం మార్పు వైపే ఫోక‌స్ పెట్టారు . రెండు సార్లు వరుసగా అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్‌ని కాదని కాంగ్రెస్‌ని గెలిపించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now