Allu Arjun Remuneration : టాలీవుడ్ హీరోలందరు ప్రస్తుతం పాన్ ఇండియా హీరోలుగా మారుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అల్లు అర్జున్ కూడా పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారాడు. పుష్ప.. పుష్ప రాజ్.. నీ యవ్వ తగ్గేదేలే అంటూ దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు పుష్ప సినిమాతో అల్లు అర్జున్ స్థాయి అమాంతం పెరిగిపోయింది. ముఖ్యంగా పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీసును బద్ధలు చేసింది. అల్లు అర్జున్, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా సుకుమార్ తెరకెక్కింకించిన ఈ సినిమా.. నార్త్, సౌత్ అనే తేడా లేకుండా అందరికీ ఫేవరెట్ గా మారిపోయింది. ఈ క్రమంలోనే ఈ సినిమాకు పార్ట్ 2 తీస్తున్నారు.
పుష్ప చిత్రం దేశవ్యాప్తంగా అంత విజయం సాధించడంతో ఇప్పుడు అందరి దృష్టి పుష్ప2 పైన ఉంది. ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధిస్తుంది. ఇందులో బన్నీ ఎలా అలరిస్తాడు అని ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్నారు. బన్నీ పార్ట్ 1 కంటే కూడా సుకుమార్ పార్ట్ 2 పై మరింత దృష్టి పెట్టారట. ఎలాగైనా సరే బ్లాక్ బస్టర్ హిట్టుగా ఈ చిత్రాన్ని మలచాలని చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. పాటలు, డైలాగ్ లతో పాటు అల్లు అర్జున్ క్యారెక్టర్ ను మరింత అందంగా మలుస్తున్నారట. ముఖ్యంగా పుష్ప సినిమాకు వచ్చిన క్రేజ్ దృష్టిలో ఉంచుకొని పుష్ప 2 విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటుందట చిత్రబృందం.
పుష్ప ది రూల్ సినిమాను 2024వ సంవత్సరం ఆగస్టు 15వ తేదీన రిలీజ్ కానున్నట్టు తెలుస్తుండగా, ఇందులో భన్వర్ సింగ్ షెకావత్ క్యారెక్టర్ లో ఫాహద్ ఫాజిల్ నటిస్తున్నాడు.. సునీల్, ధనుంజయ్, అనసూయ, విజయ్ సేతుపతి వంటి స్టార్ లు ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇదంతా ఇలా ఉండగా ఈ సినిమా కోసం అల్లు అర్జున్ భారీ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకోబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కోట్లలో పారితోషికం తీసుకోబోతున్నాడట. పుష్ప2 కోసం జరిగే పూర్తి బిజినెస్ లో 33 శాతం ఐకాన్ స్టార్ కు వచ్చేలా అగ్రిమెంట్ చేసుకున్నారంట. అంటే ఈ సినిమాకు వచ్చే థియేటర్, ఓటీటీ, డిజిటల్, డబ్బింగ్, పాటలు, శాటిలైట్… ఇలా అన్నీ కలుపులకొని వచ్చే లాభాల్లో హీరోకు 33 శాతం వచ్చేలా బన్నీ అగ్రిమెంట్ చేసుకున్నాడు అని ప్రచారం జరుగుతుంది. అంటే బన్నీ సుమారు రూ.300 కోట్లకుపైనే దక్కుతుందని సమాచారం. ఒకవేళ చిత్రం అంత పెద్ద విజయం సాధించకపోయిన కూడా రూ. 150 కోట్లు ఈ మూవీకి రావడం ఖాయం అని అంటున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…