Ajay Gadu OTT Release : ఇటీవల “విశ్వక్” సినిమాతో ముద్ర వేసిన అజయ్ కతుర్వార్ ఇప్పుడు అజయ్ గాడు చిత్రంతో పలకరించేందుకు సిద్ధమయ్యాడు. “అజయ్ గాడు” టైటిల్ మరియు ఫస్ట్ లుక్ కి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. అజయ్ గాడు పవర్ ప్యాక్డ్ టీజర్ ఆకట్టుకుంది అధిక నిర్మాణ విలువలు, ఇంటెన్స్ యాక్షన్, అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అజయ్ కతుర్వార్ ఇంటెన్స్ లవ్ స్టోరీతో వస్తున్నట్లు కనిపిస్తోంది. అజయ్‌గాడు మూవీ డైరెక్ట్‌గా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. జీ5 ఓటీటీలో సంక్రాంతి వీక్‌లోనే అజయ్‌గాడు మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. అజయ్ గాడు సినిమాలో భానుశ్రీ, శ్వేతమెహతా హీరోయిన్లుగా నటించారు.
బిగ్‌బాస్ ఫేమ్ అజయ్ కతుర్వార్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘అజయ్ గాడు’. అజయ్‌కుమార్ ప్రొడక్షన్స్ పతాకంపై చందన కొప్పిశెట్టి టీమ్ నిర్మిస్తున్నారు. ‘రాగాల 24గంటల్లో, అలాంటి సిత్రాలు తరువాత పలు చిత్రాల్లో కీలకపాత్రల్లో నటించాను. ఇప్పుడు ఓ ఆసక్తికరమైన కథతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను. ఈ చిత్రం హీరోగా నా కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలుస్తుందనే నమ్మకం ఉంది అని అన్నారు అజయ్.రెంటల్ విధానంలో కాకుండా జీ5 సబ్‌స్క్రైబర్లు అందరికి అందుబాటులో ఉండేలా ఫ్రీ స్ట్రీమింగ్‌తో ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు.
చందన కొప్పిశెట్టితో కలిసి అజయ్ కతుర్వార్ స్వయంగా ఈ సినిమాను నిర్మించాడు. రిలీజ్ డిలే కావడంతో డైరెక్ట్‌గా ఓటీటీలో సినిమాను స్ట్రీమింగ్ చేయాలని నిర్మాతలు భావించారట. మరి ఈ మూవీ ప్రేక్షకులని ఎంతగా అలరిస్తుందనేది చూడాలి. గతంలో ఎంత కష్టపడ్డ కూడా మంచి విజయాలు సాధించని అజయ్ ఈ సారైన హిట్ కొట్టాలని అనుకుంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో..!
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…