వినోదం

సూర్యతో దిల్ రాజు రిస్కీ ప్రాజెక్ట్.. ఫ్లాప్ డైరెక్టర్‌కు మరో ఛాన్స్!

వరుస తెలుగు సినిమాలతో బిజీగా మారిన కోలీవుడ్ స్టార్ సూర్య. Photo Credit: Suriya/Dil Raju/Parasuram/X/Instagram.

తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) తాజాగా తెలుగు సినిమాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య నటిస్తున్న స్ట్రెయిట్ తెలుగు సినిమా వార్తలు తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రానికి విశ్వ‌నాథం అండ్ స‌న్స్ అనే టైటిల్‌ను మేకర్స్ ఖరారు చేసిన‌ట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో సూర్యకు జోడీగా మ‌మిత బైజు నటిస్తోంది. షూటింగ్ వేగంగా సాగుతుండగా, త్వరలోనే విడుదలకు సిద్ధం చేసే పనిలో టీమ్ ఉన్నట్లు సమాచారం. కాగా, ఈ సినిమా థియేటర్లలోకి రాకముందే సూర్య మరో స్ట్రెయిట్ తెలుగు ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇండస్ట్రీలో బజ్ నడుస్తోంది. ఈ చిత్రానికి ప‌ర‌శురాం దర్శకత్వం వహించనున్నారని సమాచారం. విజయ్ దేవరకొండతో చేసిన ది ఫ్యామిలీ స్టార్ ఘోర పరాజయం తర్వాత పరశురామ్‌కు ఇది డూ ఆర్ డై ప్రాజెక్ట్‌గా మారిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

మ‌హేష్ తో చాన్స్ వ‌చ్చినా..

ఈ సూర్య-పరశురామ్ చిత్రాన్ని మళ్లీ దిల్ రాజు నిర్మించనున్నారని వార్తలు వస్తున్నాయి. ఫ్యామిలీ స్టార్ ఫియాస్కో తర్వాత కూడా పరశురామ్‌కు మరో అవకాశం ఇవ్వడం పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. పరశురామ్ కెరీర్ విషయానికి వస్తే గీత గోవిందం బ్లాక్‌బస్టర్ తర్వాత ఆయనకు మ‌హేష్ బాబుతో స‌ర్కారు వారి పాట చేసే అవకాశం లభించింది. అయితే ఆ సినిమా నెగటివ్ టాక్‌ను ఎదుర్కొంది. ఆ తర్వాత విజయ్ దేవరకొండతో చేసిన ఫ్యామిలీ స్టార్ తో తన ప్రతిభను నిరూపిస్తారని భావించినా, ఆ సినిమా బాక్సాఫీస్‌తో పాటు ఓటీటీలోనూ తీవ్ర విమర్శలు ఎదుర్కొని పరశురామ్ విశ్వసనీయతను మరింత దెబ్బతీసింది.

పాత క‌థాంశాల‌తోనే..?

ఇండస్ట్రీలో పలువురు పరశురామ్‌ను పాత కథాంశాలకే పరిమితమైన దర్శకుడిగా అభివ‌ర్ణిస్తున్నారు. గీత గోవిందం అప్పట్లో ఎంటర్‌టైన్‌మెంట్ కారణంగా వర్క్ అయిందని, ఆ తర్వాతి సినిమాలు మాత్రం ట్రోలింగ్‌కు గురయ్యాయని అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లోనూ దిల్ రాజు మరోసారి ఆయనపై నమ్మకం పెట్టడం ఆసక్తికరంగా మారింది. సూర్య-పరశురామ్ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశముందని సమాచారం. ఇప్పుడు సినీ వర్గాల్లో ప్రధాన చర్చ ఒక్కటే-ఈ సినిమాతో పరశురామ్ మళ్లీ హిట్ ట్రాక్‌లోకి వస్తారా? లేక ఇది ఆయన దర్శకుడిగా కెరీర్‌కు తుది అంకంగా మారుతుందా? అని చ‌ర్చించుకుంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

విమర్శించే వారిని పట్టించుకోవడం మానేశా.. ‘రాకాస’ ఈవెంట్‌లో నిహారిక బోల్డ్ కామెంట్స్!

త‌నను విమ‌ర్శించే వారిని ప‌ట్టించుకోవ‌డం ఎప్పుడో మానేశాన‌ని న‌టి, నిర్మాత కొణిదెల నిహారిక అన్నారు. త‌న సొంత బ్యాన‌ర్‌పై తెర‌కెక్కుతున్న…

Tuesday, 31 March 2026, 3:05 PM

ఖుష్బూ భర్త సుందర్ సి పేరిట నకిలీ ఖాతాలు.. ఫ్యాన్స్‌కు నటి సీరియస్ వార్నింగ్!

సోష‌ల్ మీడియాలో ఇప్ప‌టికే చాలా మంది సినీ సెల‌బ్రిటీలు భిన్న ర‌కాల ప్లాట్‌ఫామ్‌ల‌లో అకౌంట్ల‌ను ఓపెన్ చేసి త‌మ అభిమానుల‌తో…

Monday, 30 March 2026, 8:36 PM

తల్లయ్యాక నాలో ‘ఆడపులి’ మేల్కొంది.. మాతృత్వంపై కియారా అద్వానీ ఎమోషనల్ కామెంట్స్!

త‌ల్లిన‌య్యాక త‌న జీవితాన్ని చూసే విధాన‌మే మారిపోయింద‌ని బాలీవుడ్ న‌టి కియారా అద్వానీ తెలిపింది. హీరోల‌కు దీటుగా యాక్ష‌న్ స‌న్నివేశాల్లో…

Monday, 30 March 2026, 3:30 PM

ఎస్ఆర్‌హెచ్ ఓటమికి కారణం అదే.. ఇర్ఫాన్ పఠాన్ షాకింగ్ అనాలసిస్!

బ్యాటింగ్‌లో ప‌వ‌ర్ ప్లేలో ఎదురైన స‌మ‌స్య‌లు, ప్ర‌భావ‌వంతం కాని బౌలింగ్ వ‌ల్ల‌నే స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ (SRH) జ‌ట్టు ఐపీఎల్…

Sunday, 29 March 2026, 9:59 PM

‘బాహుబలి 2’ రికార్డులు బ్రేక్.. నిర్మాత శోభు యార్లగడ్డ రియాక్షన్ ఇదే! ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ సునామీ..

ర‌ణ్‌వీర్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన ధురంధ‌ర్ 2 బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసి వ‌సూళ్ల‌లో దూసుకెళ్తోంది.…

Sunday, 29 March 2026, 5:33 PM

అల్లు అర్జున్‌కి డ్యాన్స్ నేర్పించింది నేనే.. రాధికా శరత్ కుమార్ షాకింగ్ కామెంట్స్!

అల్లు అర్జున్ యాక్టింగ్‌లోనే కాదు, డ్యాన్స్‌లోనూ ఎంతో ప్రావీణ్యుల‌ని అంద‌రికీ తెలిసిందే. అయితే ఆయ‌న‌కు డ్యాన్స్ నేర్పింది తానేన‌ని సీనియ‌ర్…

Sunday, 29 March 2026, 3:04 PM

నా పెళ్లిపై వస్తున్న వార్తలు నమ్మకండి.. క్లారిటీ ఇచ్చిన సాయి పల్లవి!

ప్ర‌స్తుతం త‌న ధ్యాస‌, దృష్టి అంతా సినిమాల‌పైనే ఉంద‌ని, ఇప్ప‌ట్లో వివాహం చేసుకునే ఉద్దేశం లేద‌ని న‌టి సాయిప‌ల్ల‌వి స్ప‌ష్టం…

Saturday, 28 March 2026, 7:37 PM

శ్రీరామ నవమి వేళ మారుతి క్రేజీ అప్‌డేట్.. ‘రాజా సాబ్’ ఫ్లాప్ తర్వాత కొత్త సినిమా!

దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌లు శ్రీ‌రామ‌న‌వ‌మి వేడుక‌ల‌ను ఎంతో భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో జ‌రుపుకున్నారు. ఎక్క‌డ చూసినా శ్రీ‌సీతారాముల క‌ల్యాణ ఉత్స‌వాల‌తో ఆధ్యాత్మిక శోభ…

Friday, 27 March 2026, 7:56 PM