వినోదం

12th Fail Movie OTT Release : 12th ఫెయిల్ స్ట్రీమింగ్‌కి సిద్ధం.. ఇన్‌స్పైరింగ్ మూవీ ఎప్ప‌టి నుండి స్ట్రీమింగ్ అంటే..!

12th Fail Movie OTT Release : ఓటీటీలో ఇటీవ‌ల వ‌చ్చే చాలా సినిమాలు ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆదరిస్తున్నాయి. ఇప్పుడు 12th ఫెయిల్ చిత్రం ఓటీటీలో సంద‌డి చేసేందుకు సిద్ధ‌మైంది. ప‌ట్టుద‌ల‌తో చ‌ద‌వి చివ‌ర‌కు కాపీ కొట్ట‌కుండానే పాసైన ఆ స్టూడెంట్‌.. ఎలా ఐపీఎస్‌ అయ్యాడ‌న్న స్టోరీని వావ్‌ అనేలా ప్ర‌జెంట్ చేశారు. ప్రేర‌ణాత్మ‌క రీతిలో సాగిన 12th ఫెయిల్ సినిమా ఆస్కార్స్‌కు ఇండిపెండెంట్ నామినేష‌న్ కింద వెళ్లింది. ఆస్కార్స్‌కు నామినేష‌న్ వేసిన విష‌యాన్ని ఆ ఫిల్మ్ హీరో విక్రాంత్ మాసే తెలిపారు. ప్రేర‌ణాత్మ‌క రీతిలో సాగిన 12th ఫెయిల్ 20 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిగా, ఈ చిత్రం 70 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. మ‌నోజ్ కుమార్ అనే ఐపీఎస్ ఆఫీస‌ర్ జీవితం ఆధారంగా తెర‌కెక్కిన ఈ చిత్రానికి విధు వినోద్ చోప్రా ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. విక్రాంత్ మాసే ఈ ఫిల్మ్‌లో కీల‌క పాత్ర పోషించాడు. టీవీ రంగంలో విక్రాంత్ కెరీర్ ప్రారంభ‌మైంది. అత‌ను డ్యాన్స‌ర్ కూడా.

థియేట‌ర్ల‌లో ఆడియెన్స్‌ను మెప్పించిన ఈ మూవీ తాజాగా ఓటీటీలోకి రాబోతోంది. జీ5 ఓటీటీ రైట్స్ సొంతం చేసుకోగా, జ‌న‌వ‌రి 5 న‌ 12 ఫెయిల్ మూవీ జీ5 ఓటీటీలో రిలీజ్ కానున్న‌ట్లు తెలిసింది. తెలుగు, హిందీతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ భాష‌ల్లో మూవీ స్ట్రీమింగ్ కానుంది. చిత్రంలో విక్రాంత్ న‌ట‌న‌కు ప్ర‌శంస‌లు ద‌క్కాయి. విద్యావ్య‌వ‌స్థ‌లోని లోతుపాతుల‌తో పాటు సివిల్స్ కోసం స‌న్న‌ద్ద‌మ‌య్యే పేద విద్యార్థుల జీవితాల‌ను 12th ఫెయిల్ సినిమా లో మ‌న‌సుల్ని క‌ద‌లించేలా ఆవిష్క‌రించారు. ఈ సినిమా అక్టోబ‌ర్ 27న రిలీజైంది. ఒక భాషలో సూపర్ హిట్ అయిన సినిమాలను ఇతర భాషల్లో డబ్ చేయడం సర్వసాధారణం.

12th Fail Movie OTT Release

అలానే బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన 12త్ ఫెయిల్ త‌మిళ్‌, తెలుగు, క‌న్న‌డ భాష‌ల్లో విడుద‌ల చేశారు. 12త్ ఫెయిల్ అనే సినిమాను ఐపీఎస్ ఆఫీస‌ర్ మ‌నోజ్ కుమార్ శ‌ర్మ‌, ఐఆర్ఎస్ ఆఫీస‌ర్ శ్ర‌ద్ధా జోష్ జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కించారు. అదే పేరుతో అనురాగ్ పాఠక్ రాసిన బెస్ట్ సెల్లర్ పుస్తకం ఆధారంగా తీశారు. కథకి అనుగుణంగా సినిమాను బాగా తెరకెక్కించారు మేకర్స్. ప్రధాన పాత్రలో నటించిన విక్రాంత్ మాస్సే తన పాత్రలో జీవించాడు. మేధా శంకర్ పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. 12th ఫెయిల్‌లో చాలా హార్ట్ టచింగ్ మూమెంట్స్ ఉన్నాయి. అయితే కొన్ని చోట్ల కథనం చాలా నెమ్మదిగా సాగడం, కొన్ని చోట్ల ముందుగా ఏం జరుగుతుంది అనేది ఊహించే విధంగా ఉంటుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి అంటే?

ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధ‌మైంది. ఈ…

Tuesday, 14 April 2026, 3:21 PM

పాత ఫ్లాపులని గుర్తు చేస్తూ ట్రోల్ చేస్తే బాధగా ఉంటుంది.. కృతి శెట్టి ఎమోషనల్ కామెంట్స్!

తాను గ‌తంలో చేసిన సినిమాలు చాలా వ‌ర‌కు ఫ్లాప్ అయ్యాయి క‌నుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…

Saturday, 11 April 2026, 8:35 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్‌పై చిరంజీవి ఎమోషనల్.. పరిశ్రమకు ఇది పెద్ద దెబ్బ అంటూ ఆవేదన!

తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన‌ చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంట‌ర్నెట్‌లో…

Friday, 10 April 2026, 6:40 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్.. 5 నిమిషాల యాక్షన్ సీన్ నెట్టింట వైరల్! షాక్‌లో చిత్ర యూనిట్..

తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…

Friday, 10 April 2026, 12:43 PM

ప్రొపగాండా అంటే ఏంటి? ‘ధురంధర్ 2’ విమర్శకులపై సందీప్ రెడ్డి వంగా నిప్పులు!

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధ‌ర్ 2 ది…

Thursday, 9 April 2026, 11:07 PM

‘కిల్లర్’ మిల్లర్ ఇప్పుడు విలన్ అయ్యాడా? డీసీ ఓటమిపై సునీల్ గవాస్కర్ సంచలన విశ్లేషణ..

ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…

Thursday, 9 April 2026, 9:01 PM

చదువు ముఖ్యం, హీరోలు కాదు! యువతకు రజనీకాంత్ హితవు.. కమల్‌తో మూవీపై క్లారిటీ..

ప్ర‌స్తుత త‌రుణంలో యువ‌త హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువ‌గా ఆక‌ర్షిత‌మై చ‌దువుల‌పై శ్ర‌ద్ధ పెట్ట‌డం లేద‌ని, సామాజిక మాధ్య‌మాల వ‌ల్ల…

Thursday, 9 April 2026, 3:13 PM

భాష నేర్చుకుంటేనే నటన ఈజీ.. కయాదు లోహర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

న‌టీన‌టులు మాతృభాష‌లో కాకుండా ఇత‌ర భాష‌ల్లో సినిమాలు చేస్తే ఆయా భాష‌ల‌ను నేర్చుకుంటేనే సౌక‌ర్య‌వంతంగా ఉంటుంద‌ని న‌టి క‌యాదు లోహ‌ర్…

Thursday, 9 April 2026, 11:48 AM