విద్య & ఉద్యోగం

విప్రో కంపెనీలో ఉద్యోగాల జాత‌ర‌.. ఏడాదికి జీతం రూ.3.50 ల‌క్ష‌లు..

క‌రోనా ప్ర‌భావం వ‌ల్ల ఉద్యోగాలు కోల్పోయిన వారితోపాటు ఫ్రెష‌ర్స్‌కు ప్ర‌ముఖ సంస్థ విప్రో అదిరిపోయే శుభ‌వార్త చెప్పింది. విప్రో ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న ఎలైట్ నేష‌న‌ల్ టాలెంట్ హంట్‌లో భాగంగా 2022 వ‌ర‌కు 30,000 మందిని నియ‌మించుకోనున్న‌ట్లు తెలిపింది. అందుకు గాను ప్ర‌త్యేక కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తోంది.

విప్రో నిర్వ‌హిస్తున్న ఎలైట్ నేష‌న‌ల్ టాలెంట్ హంట్‌కు రిజిస్ట్రేష‌న్ల ప్ర‌క్రియ ఆగ‌స్టు 23న ప్రారంభం కాగా సెప్టెంబ‌ర్ 15న ముగియ‌నుంది. ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేష‌న్లు చేసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 25 నుంచి 27 మ‌ధ్య‌లో ఆన్ లైన్ అసెస్‌మెంట్ చేస్తారు.

2022 వ‌ర‌కు డిగ్రీ పాస్ అయ్యే వారు కూడా ఇందుకు ద‌ర‌ఖాస్తు చేయ‌వ‌చ్చు. వ‌య‌స్సు 25 సంవ‌త్స‌రాల లోపు ఉండాలి. బీఈ లేదా బీటెక్ లో క‌చ్చితంగా డిగ్రీ చేసి ఉండాలి. లేదా ఎంఈ ఎంటెక్‌లో 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సు ఫుల్ టైమ్ చేసి ఉండాలి. ఫ్యాష‌న్ టెక్నాల‌జీ, టెక్స్‌టైల్ ఇంజినీరింగ్‌, అగ్రిక‌ల్చ‌ర్ అండ్ ఫుడ్ టెక్నాల‌జీ కాకుండా మిగిలిన అన్ని బ్రాంచిల్లో చ‌దివిన వారు ద‌ర‌ఖాస్తు చేయ‌వ‌చ్చు.

యూనివ‌ర్సిటీ నిబంధ‌న‌ల ప్ర‌కారం 60 శాతం లేదా 6 సీజీపీఏ స్కోరును సాధించి ఉండాలి. టెన్త్‌, ఇంట‌ర్‌, డిగ్రీల‌లో ఫుల్ టైమ్ కోర్సుల‌ను చ‌దివి ఉండాలి. పార్ట్ టైమ్ లేదా, క‌రెస్పాండెన్స్ లేదా డిస్టాన్స్‌లో చ‌దివిన వారికి ప్రాధాన్య‌త ఇవ్వ‌బ‌డ‌దు. 10వ త‌ర‌గ‌తిలో 60 శాతానికి పైగా, ఇంట‌ర్‌లో 60 శాతానికి పైగా మార్కుల‌ను సాధించి ఉండాలి.

అర్హ‌త సాధించిన అభ్య‌ర్థుల‌కు ఏడాదికి రూ.3.50 ల‌క్ష‌ల వేత‌నం ఇస్తారు. మొద‌టి 12 నెల‌ల పాటు రూ.75వేలు ఇస్తారు. త‌రువాత ప్రొ రేటా బేసిస్‌లో పెంచుతూ పోతారు. అసెస్‌మెంట్ స‌మ‌యంలో ఒక బ్యాక్‌లాగ్ ఉంటేనే ప‌రిగిణ‌న‌లోకి తీసుకుంటారు. 10 త‌రువాత డిగ్రీ మొద‌లు పెట్ట‌డానికి మ‌ధ్య గ‌రిష్టంగా 3 ఏళ్ల వ్య‌వ‌ధి మాత్ర‌మే ఉండాలి.

భార‌తీయ విద్యార్థులు మాత్ర‌మే ఇందుకు ద‌ర‌ఖాస్తు చేయాలి. నేపాల్‌, భూటాన్ విద్యార్థులు అయితే త‌మ సిటిజెన్‌షిప్ స‌ర్టిఫికెట్‌ను చూపించాలి. గ‌త 6 నెల‌ల కాలంలో విప్రో నిర్వ‌హించిన సెలెక్ష‌న్స్‌లో పాల్గొని ఉండ‌రాదు.

ఆన్‌లైన్ అసెస్‌మెంట్ 128 నిమిషాల పాటు ఉంటుంది. మూడు సెక్ష‌న్లు ఉంటాయి. లాజిక‌ల్ ఎబిలిటీ ఆప్టిట్యూడ్ టెస్ట్‌, క్వాంటిటేటివ్ ఎబిలిటీ, ఇంగ్లిష్ వెర్బ‌ల్ ఎబిలిటీ మొత్తం క‌లిపి 48 నిమిషాలు ఉంటాయి. 20 నిమిషాల్లో రిటెన్ క‌మ్యూనికేష‌న్ టెస్ట్‌ను ఎస్సే రైటింగ్‌తో పూర్తి చేయాలి. ఆన్‌లైన్ లో ప్రోగ్రామింగ్ టెస్టు ఉంటుంది. అందులో ఏవైనా రెండు ప్రోగ్రామ్‌ల‌ను కోడింగ్ చేయాలి. ఈ టెస్టు 60 నిమిషాలు ఉంటుంది.

ప్రోగ్రామింగ్ టెస్ట్‌ల‌కు గాను అభ్య‌ర్థులు జావా, సి, సి++, పైథాన్‌ల‌లో వేటినైనా ఎంపిక చేసుకోవ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM