Nava Graha : నవగ్రహాలు శివాలయాల్లోనే ఎక్కువగా ఎందుకుంటాయి..? అలాంటప్పుడు ముందు శివున్ని దర్శించాలా.. నవగ్రహాలనా..?

March 8, 2024 9:33 AM

Nava Graha : బుధుడు, శుక్రుడు, కుజుడు, బృహ‌స్పతి, శ‌ని, రాహువు, కేతువు, సూర్యుడు, చంద్రుడు అని మొత్తం 9 గ్ర‌హాలు ఉంటాయి తెలుసు క‌దా. జ్యోతిష్యులు జాత‌కాలు చెప్పేది కూడా వీటి స్థితి కార‌ణంగానే. ఈ క్ర‌మంలో ఏవైనా గ్ర‌హ దోషాలు ఉంటే కొంద‌రు పూజ‌లు కూడా చేస్తారు. అయితే ఈ న‌వ‌గ్ర‌హాలు అనేవి ప్ర‌ధానంగా శివాల‌యాల్లోనే మ‌న‌కు ఎక్కువ‌గా క‌నిపిస్తాయి. దీనికి కార‌ణం ఏమిటో తెలుసా..

న‌వ‌గ్రహాల‌లో ఒక్కో గ్ర‌హానికి ఒక్కో అధిష్టాన దేవ‌త ఉంటుంది. ఆ దేవ‌త‌ల‌ను నియ‌మించింది శివుడే. దీంతోపాటు గ్రహాలకు మూలమైనటువంటి సూర్యదేవుడికి ఆదిదేవుడు కూడా శివుడే. ఈ కారణంగానే గ్రహాలన్నీ కూడా శివుడి ఆదేశానుసారమే సంచరిస్తూ వుంటాయి. అందువల్లనే శివాలయాల్లో నవగ్రహ మంటపాలు ఎక్కువగా దర్శనమిస్తూ ఉంటాయి.

why Nava Graha mandapams in shiva temples
Nava Graha

ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే శివాలయానికి వెళ్ళిన తర్వాత నవగ్రహాలను ముందుగా దర్శించాలా లేదా ఆ పరమ శివుడిని ముందుగా దర్శించాలా అన్న సందేహం చాలా మందిలో ఉంటుంది. శివాలయంలో నవగ్రహాలను చూసిన వెంటనే మొదట ఆ పరమశివుడి వద్దకు వెళ్లాలా లేదా నవగ్రహారాధన చేయాలన్నా అన్న సందిగ్ధిత ఉంటుంది. పరమేశ్వరుడు ఆదిదేవుడు, పాలకుడు. కర్తవ్యాన్ని బోధించేది శివుడు. ముందుగా శివున్ని దర్శించుకోవాలి. లేదా నవగ్రహాలను దర్శించినా ఆ పరమ శివుడి అనుగ్రహానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే శివుణ్ణి ప్రార్థించిన త‌రువాత నవగ్ర‌హాల‌ను ప్రార్థిస్తే తమ స్వామిని ముందుగా కొలిచినందుకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తాయి. అయితే శివాల‌యం కాకుండా కొన్ని ఇత‌ర ఆలయాల్లోనూ మ‌న‌కు న‌వ‌గ్ర‌హాలు ద‌ర్శ‌న‌మిస్తాయి. కానీ ఏ ఆల‌యంలో న‌వ‌గ్ర‌హ మండ‌పాలు ఉన్నా చుట్టూ ప్ర‌ద‌క్షిణ చేయ‌డం ఉత్త‌మం. అలా చేస్తే గ్ర‌హ దోషాలు పోతాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now