ఆధ్యాత్మికం

Lord Shiva : శివుని తలమీద చంద్రుడు ఎందుకు ఉంటాడో తెలుసా..?

Lord Shiva : ప‌ర‌మ ప‌తివ్ర‌త అన‌సూయ దేవి కుమారుడు చంద్రుడు. మంచి గుణాల‌తో క‌నిపించిన చంద్రుడిని త‌న అల్లుడిగా చేసుకోవాల‌నుకుంటాడు ద‌క్షుడు. బ్ర‌హ్మ కుమారుడైన‌ దక్షుడికి 27 మంది కుమార్తెలు. ఒక‌రిని మాత్ర‌మే చంద్రుడికి క‌ట్ట‌బెట్ట‌డం ఇష్ట‌లేక త‌న 27 మంది కుమార్తెల‌ను చంద్రుడికిచ్చి పెళ్లి చేస్తాడు దక్షుడు. త‌న 27 మంది బిడ్డ‌లంద‌ర్నీ స‌మానంగా చూసుకోవాల‌ని, ఎవర్నీ బాధ‌పెట్ట‌ొదంటూ చంద్రుని వ‌ద్ద మాట‌ తీసుకుంటాడు దక్షుడు. అయితే కొద్ది రోజుల‌కే చంద్రుడు మామ‌కిచ్చిన మాట‌ త‌ప్పుతాడు.

రోజుకొక్కరి చొప్పున 27 మంది భార్య‌ల వ‌ద్ద గ‌డిపే చంద్రుడికి పెద్ద భార్య రోహిణి అంటే చాలా ఇష్టం. దీని కార‌ణంగా మిగితా 26 మందిని సరిగ్గా ప‌ట్టించుకునేవాడు కాదంట చంద్రుడు. ఇదే విషయాన్ని దక్షుడి 26 మంది కూతుర్లు తండ్రికి ఫిర్యాదు చేస్తారు. ఈ విష‌యం మీద చంద్రుడిని మందలించినా అతనిలో మార్పు రాక‌పోవ‌డంతో కోపోద్రిక్తుడైన ద‌క్షుడు చంద్రుడికి శాపం ఇస్తాడు. దినదినం నీ వెలుగు త‌గ్గిపోవుతూ చివ‌రికి అంత‌మ‌వుతావంటూ శాప‌మిస్తాడు. దీంతో ఏం చేయాలో పాలుపోని చంద్రుడు శాప‌విమోచ‌నం ప్ర‌సాదించ‌మ‌ని ప్రాధేయ‌ప‌డతాడు. అయినా ద‌క్షుడు స‌సేమీరా అన‌డంతో ముల్లోకాల్లో ఉన్న దేవ‌త‌ల వ‌ద్ద‌కు వెళ‌తాడు చంద్రుడు.

Lord Shiva

ద‌క్షుడు బ్ర‌హ్మ‌కుమారుడు కావ‌డంతో త‌న కుమారుడి శాపానికి తిరుగు లేదంటూ బ్ర‌హ్మ చంద్రుడిని పంపించేస్తాడు. విష్టు మూర్తి వ‌ద్ద‌కు ప‌రుగులు తీసిన చంద్రుడుకి అక్కడా భంగ‌పాటే ఎదుర‌వుతుంది. దీంతో చివ‌రి ప్ర‌యత్నంగా శివుడి వ‌ద్ద‌కు వెళతాడు చంద్రుడు. అస‌లే భోళాశంకురుడు. త‌న‌ భ‌క్తుల‌కు ఎలాంటి వ‌రాలిచ్చేందుకైనా సిద్ధ‌మ‌య్యే భ‌గ‌వంతుడు. ఇంకేముంది. చంద్రుడి మొర‌ విన‌గానే క‌రిగిపోతాడు శివుడు.

అయితే ద‌క్షుడి శాపంలో అర్థం ఉండ‌డం.. ఒకరి మోజులోనే లోకాన్ని మ‌రిచిపోవ‌డం కార‌ణంగా శాపం త‌ప్ప‌ద‌ని చెబుతాడు శివుడు. ఎలాగైనా త‌న‌ని కాపాడాలంటూ కాళ్ల వేళ్లా ప‌డుతాడు చంద్రుడు. దీంతో మ‌ధ్యే మార్గంగా ఓ ఉపాయం ఆలోచించిన శివుడు.. లోక క‌ళ్యాణార్థం నీ వెలుగు త‌ప్ప‌ని స‌రి క‌నుక‌.. ప‌క్షం రోజులు క్షీణించి తిరిగి ప‌క్షం రోజులు నీ వెలుగు.. నువ్వు పెరుగుతావ‌ని ఆశీర్వ‌దిస్తాడు శివుడు. అందుకు భ‌క్తిగా త‌న‌ను తాను శివుడికి స‌మ‌ర్పించుకుంటాడు చంద్రుడు. మీ సిగ‌లో చోటిస్తే లోక కళ్యాణం కోసం పాటుప‌డుతానంటూ చెబుతాడు. అందుకు స‌రేన‌న్న శివుడు చంద్రుడిని సిగ‌లో ధ‌రించి చంద్ర శేఖ‌రుడిగా మారాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM