Money : రోడ్డుపై డబ్బులు దొరకడం శుభమా..? అశుభమా..?

December 21, 2023 9:47 PM

Money : ఒక్కొక్కసారి మనం రోడ్డు మీద వెళ్తుంటే, మనకి డబ్బులు దొరుకుతుంటాయి. అయితే, రోడ్డు మీద డబ్బులు దొరికితే, అది మంచిదా కాదా..? శుభమా, శుభమా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. ఎప్పుడైనా మనం రోడ్డు మీద వెళుతున్నప్పుడు, వెళ్లే మార్గంలో మనకి డబ్బులు దొరుకుతూ ఉంటాయి. డబ్బులు అంటే ఇవి నాణేల రూపంలో ఉండొచ్చు. లేదంటే ఇది మనకి నోట్ల రూపంలో అయినా ఉండొచ్చు.

అలాంటి పరిస్థితుల్లో, ఈ డబ్బులు ఏం చేయాలి..? అయితే, కొంతమంది డబ్బుల్ని తీసుకోవడం వలన తప్పు కాదు అని తీసుకుంటూ ఉంటారు. కొంతమంది మాత్రం, డబ్బులని తీసుకుంటే పాపం, చెడు అని భావిస్తూ ఉంటారు. అయితే, రోడ్డు మీద డబ్బులు దొరకడం అనేది ఆధ్యాత్మికతతో ముడిపడి ఉంది అని వాస్తు చెప్తోంది. డబ్బు దొరకడం వలన, ఎటువంటి ఫలితం కలుగుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. నిజానికి రోడ్డుమీద డబ్బులు కనపడితే అది శుభం.

what happens if you found Money on the road
Money

రోడ్డుపై పడి ఉన్న డబ్బులు చూస్తే, మీ పూర్వీకులు ఆశీర్వాదం లభిస్తుందని వాస్తు శాస్త్రం చెప్తోంది. అటువంటి పరిస్థితుల్లో, మీరు ఏదైనా పనిని పూర్తి శ్రమతో చేస్తే, కచ్చితంగా విజయాన్ని అందుకుంటారు. దీనిని అదృష్టంగా పరిగణించాలి. అలానే, వాస్తు ప్రకారం మీరు ఎక్కడికైనా ముఖ్యమైన పని మీద వెళుతున్నప్పుడు, మార్గం మద్య మీకు డబ్బులు కనపడినట్లైతే, పనిలో తప్పక విజయం అందుకుంటారని దానికి అర్థం.

పని నుండి మీరు తిరిగి ఇంటికి వస్తుండగా, మార్గం మధ్యలో మీకు డబ్బులు కనపడితే ఆర్థిక ప్రయోజనాలని పొందుతారని దానికి అర్థం. రోడ్డుపై పడి ఉన్న డబ్బుని చూస్తే, దానిని ఆలయానికి విరాళంగా ఇచ్చేయాలి. లేదంటే మీరు పర్సులో కానీ ఇంట్లో కానీ పెట్టుకోవచ్చు. అయితే, దానిని మాత్రం ఖర్చు చేయకూడదని గుర్తుపెట్టుకోండి. దారిలో డబ్బులు మీరు చూసినట్లయితే, త్వరలో మీరు కొత్త పనిని ప్రారంభించనున్నారని దానికి సంకేతం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now