Upavasam : చాలామంది ఉపవాసం ఉంటూ ఉంటారు. పర్వదినాలప్పుడు కానీ లేదంటే వారానికి ఒకసారి అని కానీ, చాలా మంది ఉపవాసాలు చేస్తూ ఉంటారు. ఉపవాసాలు చేసేటప్పుడు కొన్ని విషయాలని కచ్చితంగా పాటించాలి. ఏం చేయాలన్నా కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. ఉపవాసానికి కూడా కొన్ని రోజులు ఉన్నాయి. ఉపవాసం చేసేటప్పుడు తప్పులు చేయడం వలన, ఉపవాసం చేసిన ఫలితం ఉండదు. మీరు అనుకున్న పనులు జరగవు. కోరికలు నెరవేరవు.
ఉపవాసానికి సంబంధించిన ఒక విషయాన్ని కచ్చితంగా ప్రతి ఒక్కరూ పాటించాలి. ఉపవాసం సమయంలో, అసలు నిద్రపోకూడదు. ఉపవాసం చేసే వాళ్ళు నిద్రపోతే, దాని ఫలితం ఏమీ ఉండదు. కాబట్టి, కచ్చితంగా ఉపవాసం చేసిన రోజు నిద్రపోకండి. బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసి, ఉపవాసం మొదలు పెట్టాలి. ఆలస్యంగా నిద్ర లేవడం వంటివి మంచివి కావు. బ్రహ్మ ముహూర్తంలో తల స్నానం చేసి ఆ తర్వాత దేవుడికి దీపం పెట్టుకొని ఉపవాసాన్ని మొదలుపెట్టడం మంచిది.
నిర్జల ఉపవాసం, జలోపవాసం, రసోపవాసం, ఫలోపవాసం ఇలా నాలుగు రకాల ఉపవాసాలు ఉన్నాయి. ఈ నాలుగు ఉపవాసాలు కూడా శరీరాన్ని శుద్ధి చేయడానికి ఉపయోగపడతాయి. మీకు ఏది వీలైతే, ఆ ఉపవాసాన్ని ఆచరించవచ్చు. జల ఉపవాసం అంటే, కేవలం నీళ్లు మాత్రమే తాగాలి. ఆహార పదార్థాలు ఏమి తీసుకోకూడదు. ఐదు లీటర్ల వరకు నీళ్లు తాగొచ్చు. ఉదయాన్నే పరగడుపున ఒక లీటర్ నీటిని తీసుకుని, ప్రతి రెండు గంటలకి ఒక రెండు గ్లాసుల నీళ్లు తాగాలి.
రసోపవాసం అంటే, మీరు పండ్లని తీసుకోవచ్చు. పండ్లతో ఉపవాసం చేయొచ్చు. ఉపవాసం చేయడానికి ముందు, ఉదయాన్నే స్నానం చేసి, ఇంటిని శుభ్రంగా ఉంచుకుని, తర్వాత పూజ గదిని కూడా శుభ్రం చేసుకుని, దేవుడికి దీపం పెట్టుకుని మీరు చేసే పద్ధతిలో పూజ చేసేసి ఉపవాసాన్ని మొదలుపెట్టాలి. శుభ్రమైన, ఉతికిన బట్టలను మాత్రమే కట్టుకోవాలి. నల్ల రంగు బట్టలు వేసుకోకూడదు. వీలైతే తెలుపు, పసుపు, పచ్చని బట్టలు వేసుకోవడం మంచిది. ప్రతికూల ఆలోచనలు రానివ్వకుండా, కోపానికి గురవకుండా మంచి ఆలోచనలతో ఉపవాసం చేస్తే మంచిది.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్‌లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…