Srikalahasti Temple : తిరుమల తిరుపతిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తులు శ్రీవారి దర్శనం ముగియగానే చుట్టూ ఉన్న అన్ని దేవాలయాలను దర్శించుకునేందుకు వెళుతుంటారు. పాపనాశనం.. కాణిపాకం.. చివరగా శ్రీకాళహస్తిని దర్శించుకుంటారు. ఇక చివరగా శ్రీకాళహస్తిని దర్శించుకున్న తరువాత మరే దేవాలయానికి వెళ్లకూడదని చెబుతారు.. అలా వెళితే అరిష్టం అనే ఆచారం హిందూ సంప్రదాయంలో కొనసాగుతూ వస్తోంది. అసలు ఎందుకు అలా చేయాలి.. శ్రీకాళహస్తి దేవాలయాన్నే ఎందుకు చివరగా దర్శించుకోవాలి.. శ్రీకాళహస్తి దర్శనం తరువాత మరో గుడికి ఎందుకు వెళ్లకూడదు.. వెళితే ఏమవుతుంది. నేరుగా ఇంటికే ఎందుకు వెళ్లాలి..? ఆ వివరాలను తెలుసుకుందాం.
పంచభూతాల నిలయం ఈ విశాల విశ్వం. గాలి, నింగి, నేల, నీరు, నిప్పు ఇవే పంచభూతాలు. వీటికి ప్రతీకలుగా భూమి మీద పంచభూత లింగాలు వెలిశాయి. అందులో ఒకటే చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో వెలిసిన వాయులింగం. అయితే ఇక్కడి గాలిని స్పర్శించిన తరువాత ఏ ఇతర దేవాలయాలకు వెళ్లకూడనదే ఆచారం. అందులో నిజం లేకపోలేదు. సర్పదోషం.. రాహుకేతువుల దోషం ఇక్కడికి వచ్చాక పూర్తిగా నయమవుతుంది. శ్రీకాళహస్తిలోని సుబ్రమణ్య స్వామి దర్శనంతో సర్పదోషం తొలగుతుంది. ప్రత్యేక పూజలు చేసుకున్న తరువాత నేరుగా ఇంటికే చేరాలని చెబుతారు ఇక్కడి పూజారులు. కారణం దోష నివారణ జరగాలంటే శ్రీకాళహస్తిలో పాపాలను వదిలేసి ఇంటికి వెళ్లడమే.
తిరిగి ఏ ఇతర దేవాలయాలకు వెళ్లినా దోష నివారణ ఉండదనేది అక్కడి పూజరులు చెబుతున్నారు. గ్రహణాలు.. శని బాధలు.. పరమశివుడికి ఉండవని, మిగతా అందరు దేవుళ్లకి శని ప్రభావం.. గ్రహణ ప్రభావం ఉంటాయని చెబుతున్నారు. దీనికి మరోక ఆధారం.. చంద్రగ్రహణం. ఈ రోజున కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువున్న తిరుమల తిరుపతి దేవస్థానంతో సహా అన్ని దేవాలయాలు మూసివేస్తారు. గ్రహణానంతరం సంప్రోక్షణ జరిపి అప్పుడు పూజలు ప్రారంభిస్తారు. కానీ గ్రహణ సమయంలో శ్రీకాళహస్తి దేవాలయం మాత్రం తెరిచే ఉంటుంది. అంతే కాదు రోజంతా ప్రత్యేక పూజలు జరుగుతూనే ఉంటాయి. అందుకే ఇక్కడ దర్శనం చేసుకున్నాక ఇక ఇతర దైవం దర్శనం అవసరం లేదన్నది పండితుల మాట. ఇవీ.. దాని వెనుక ఉన్న కారణాలు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…