Sri Rama Navami 2024 : శ్రీ‌రామ‌న‌వ‌మి రోజు ఇలా చేయండి.. అన్ని క‌ష్టాలు పోతాయి, హ‌నుమాన్ ఆశీస్సులు ల‌భిస్తాయి..!

April 1, 2024 12:18 PM

Sri Rama Navami 2024 : శ్రీరాముడు చైత్ర మాసం శుక్ల ప‌క్షం న‌వ‌మి రోజున జ‌న్మించాడన్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. ఆ రోజున మ‌నం ఎంతో భ‌క్తి శ్ర‌ద్ద‌ల‌తో అంగ‌రంగ‌వైభ‌వంగా శ్రీరామ‌న‌వ‌మిని జ‌రుపుకుంటాము. అయోధ్య మ‌హారాజు ద‌శ‌ర‌థుడు మ‌రియు త‌ల్లి కౌస‌ల్య యొక్క కుమారుడిగా శ్రీరాముడు జ‌న్మించాడు. త‌ల్లి కౌసల్య‌కు శ్రీరాముడు త‌న గొప్ప రూపాన్ని ద‌ర్శ‌నం ఇచ్చిన‌ప్పుడు కౌస‌ల్య అతన్ని చిన్న పిల్ల‌లా ఆడుకోమ‌ని ముకుళిత హ‌స్తాల‌తో అభ్య‌ర్థించింది. అదేవిధంగా ప్ర‌తి సంవ‌త్స‌రం లాగే ఈ సంవ‌త్స‌రం కూడా ఏప్రిల్ 17వ తేదీన మ‌నం శ్రీరామ‌న‌వ‌మిని జ‌రుపుకోనున్నాము. ఈ రోజు చాలా ప్ర‌త్యేక‌మైన‌ది. క‌నుక ఈ రోజు ప్ర‌త్యేక పూజ‌లు చేయ‌డం వ‌ల్ల జీవితంలో స‌మ‌స్య‌ల నుండి మ‌నం చాలా సుల‌భంగా బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు.

శత్రువుల స‌మ‌స్య కూడా త‌గ్గుతుంది. శ్రీరామ‌న‌వ‌మి నాడు ప్ర‌త్యేక పూజ‌లు చేయ‌డం వ‌ల్ల మ‌న‌కు క‌లిగే శుభ‌ఫ‌లితాల గురించి తెలుసుకుందాం. ఇంట్లో వారి పుట్టిన రోజును జ‌రుపుకున్న‌ట్టే ఈ రోజు శ్రీరాముడి పుట్టిన రోజును జ‌రుపుకోవాలి. మీ స్వంత చేతుల‌తో ఇంట్లోనే తీపిని త‌యారు చేసి అంద‌రికి పంచి పెట్టాలి. అలాగే ఈ రోజు హ‌నుమంతునికి కూడా ప్ర‌త్యేకంగా పూజ‌లు చేయాలి. ఆశ్వీరాదం ఇస్తున్న భంగిమలో ఉన్న హ‌నుమాన్ చిత్రాన్ని ఉంచి, ఈ చిత్రం ముందు కూర్చుని పూజ చేయాలి. రామ‌చ‌రిత‌మాన‌స్ లోని రామావ‌తారంలోని ద్విప‌ద‌ల‌ను చ‌దవాలి. అలాగే చ‌ప్ప‌ట్లు కొడుతూ శ్రీ రామ్ జై రామ్ జైజై రామ్ అనే మంత్రాన్ని చ‌ద‌వాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల హ‌నుమంతుని కృప మ‌న మీద ఉంటుంది.

Sri Rama Navami 2024 how to celebrate follow these remedies
Sri Rama Navami 2024

జీవితంలో ఉండే క‌ష్టాలు తొల‌గిపోతాయి. ఇలా కుటుంబంలోని అంద‌రూ చేయ‌డం వ‌ల్ల కుటుంబ స‌భ్యుల క‌ష్టాల‌న్నీ తొల‌గిపోతాయి. ఇంటిల్లిపాది సుఖ సంతోషాల‌తో గడుపుతారు. అలాగ శ‌త్రు భ‌యం ఉన్న వారు శ్రీరామ‌న‌వ‌మి రోజున ఎర్ర‌టి వ‌స్త్రంపై శ్రీరాముడి ద‌ర్బార్ ఫోటోను ఉంచి పూల మాల‌ల‌తో అలంక‌రించాలి. త‌రువాత నెయ్యి దీపం వెలిగించి భ‌జ‌న‌లు , కీర్త‌న‌లు చేయాలి. రామ‌ర‌క్ష స్తోత్రాన్ని చ‌ద‌వాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల సుధార‌న్ క‌వ‌చాన్ని పొందుతారు. ఇలా చేసిన వారిని హ‌నుమంతుడు ఎల్ల‌ప్పుడూ ర‌క్షిస్తూ ఉంటాడు. శ్రీరామ‌న‌వ‌మి రోజు నుండి రోజూ రామ‌ర‌క్షా స్తోత్రాన్ని చ‌ద‌వ‌డం అల‌వాటు చేసుకోంది. ఇలా చేయ‌డం వ‌ల్ల శ‌త్ర‌వుల భ‌యం త‌గ్గుతుంది. శ్రీరామ‌న‌వ‌మి నాడు ఈ విధంగా చేయ‌డం వల్ల జీవితంలో క‌ష్టాలు, చేస్తున్న ప‌నుల్లో ఆటంకాలు తొలిగిపోవ‌డంతో పాటు శ‌త్ర‌వుల పీడ నుండి కూడా విముక్తి క‌లిగి సుఖ సంతోషాల‌తో జీవిస్తార‌ని పండితులు చెబుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now