శ్రావణ మాస అమావాస్య ఎప్పుడు వచ్చింది.. అమావాస్య ప్రత్యేకత ఏమిటి ?

August 7, 2021 6:41 PM

మన హిందూ కేలండర్ ప్రకారం నేటితో ఆషాడ మాసం ముగిసి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. ప్రతి నెల అమావాస్య పౌర్ణమిలు రావడం సర్వసాధారణం. ఈ క్రమంలోనే ఆషాడమాసం ముగిస్తూ శ్రావణ మాసం ప్రారంభం అవడంతో శ్రావణ మాస అమావాస్య వస్తుంది. మరి శ్రావణ మాస అమావాస్య ఎప్పుడు వచ్చింది.. అమావాస్య తిథి ఎప్పుడు.. ఈ అమావాస్య ప్రత్యేకత ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

మన తెలుగు క్యాలెండర్ ప్రకారం శ్రావణ మాసం 5 వ నెల. ఈనెలను హిందువులు ఎంతో పరమ పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ క్రమంలోనే శ్రావణమాస అమావాస్య 2021 ఆగస్టు 8వ తేదీన వస్తుంది. ఇక అమావాస్య తిథి ఆగస్టు 7 శనివారం రాత్రి 7:13 నిమిషాలకు ప్రారంభమవుతుంది. ఆదివారం రాత్రి 7:21 గంటలకు ఈ అమావాస్య తిథి ముగుస్తుంది.

ఈ అమావాస్య మన దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తారు. మన తెలుగు రాష్ట్రాలలో శ్రావణ మాస అమావాస్య పోలాల అమావాస్య అని కూడా పిలుస్తారు. పోలాల అమావాస్య అంటే ఎద్దులకు కడుపునిండా తిండి నీరు దొరికే అమావాస్య అని అర్థం.అదేవిధంగా ఈ అమావాస్యకు గంగా నది పొంగి పొర్లుతుంది అని కూడా చెబుతారు.ఈ క్రమంలోనే ఈ అమావాస్య పురస్కరించుకొని పోలాంబ దేవికి ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Related Stories

Leave a Comment