Shiva Lingam : బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు.. త్రిమూర్తులు. వీరిలో బ్రహ్మకు ఆలయాలు ఉండవన్న సంగతి తెలిసిందే. ఇక మిగిలిన ఇద్దరినీ భక్తులు అధిక సంఖ్యలో పూజిస్తారు. అయితే శివున్ని మాత్రం లింగం రూపంలో పూజిస్తారు. ఈ క్రమంలోనే శివ లింగాన్ని పూజించే భక్తులు మూడు వస్తువుల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. వాటిని శివ పూజకు వాడరాదు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒకప్పుడు తులసి భర్త అయిన శంఖాసురుడనే రాక్షసున్ని శివుడు సంహరించాడట. దీని గురించి శివ పురాణంలో ఉంది. అప్పటి నుంచి తులసి ఆకులతో శివున్ని పూజించడం మానేశారు. ఇప్పటికీ అదే ఆచారం కొనసాగుతోంది. ఒక వేళ ఎవరైనా తులసి ఆకులతో పూజ చేస్తే వారికి అన్నీ అశుభాలే కలుగుతాయట. కాబట్టి శివున్ని తులసి ఆకులతో పూజించడం మానుకోండి. కొన్ని వేల యుగాల కిందట అత్యంత పెద్దదైన శివలింగం వెలసిందట. దానికి మొదలు, చివర అనేవి లేవట. అయితే వాటిని కనిపెట్టడం కోసం బ్రహ్మ, విష్ణువులు శివుని నుంచి అంగీకారం తీసుకుని వెళ్తారట.
అలా వారు వెళ్లినప్పుడు విష్ణువు లింగం మొదలును, బ్రహ్మ దేవుడు లింగం చివరను కనిపెట్టేందుకు చెరో దిక్కుకు వెళ్తారు. అయితే ఎంత సేపటికి లింగం మొదలు కనబడకపోవడంతో విష్ణువు వెనుదిరుగుతాడట. కానీ బ్రహ్మ దేవుడు తనకు లింగం చివర కనబడిందని శివునికి అబద్దం చెబుతాడట. ఈ క్రమంలో అతనికి కేతకి అనే పువ్వు సహాయం చేస్తుందట. దీంతో నిజం తెలుసుకున్న శివుడు ఆగ్రహం చెందుతాడు. అలా కేతకి పువ్వు కూడా శివపూజలో స్థానం కోల్పోతుంది. ఒక వేళ ఎవరైనా శివున్ని పూజిస్తే ఆ పూవును మాత్రం వాడకూడదు.
పసుపును మనం పూజల్లో వాడుతుంటాం. అయితే శివ లింగం పూజకు పసుపును మాత్రం వాడకూడదట. ఎందుకంటే శివలింగం రెండు భాగాల్లో ఉంటుంది. ఒకటి లింగం, మరొకటి జలధారి. లింగం శివున్ని సూచిస్తే, జలధారి పార్వతిని సూచిస్తుంది. కాబట్టి పసుపుతో లింగాన్ని పూజించకూడదు. అందుకు బదులుగా జలధారిని పూజించాలి. ఇలా పలు వస్తువులను శివ పూజకు ఎట్టి పరిస్థితిలోనూ ఉపయోగించరాదు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…