Shankham : చాలామంది ప్రశాంతంగా ఉంటుందని ఆలయాలకి వెళుతూ ఉంటారు. కొంచెం సేపు మనం ఏదైనా దేవాలయంలో గడిపితే చాలు. ఎంతో సంతోషంగా ఉంటుంది. మనసు తేలికగా ఉంటుంది. తెలియని కొత్త ఉత్సాహం కలుగుతుంది. ఏదో శక్తి మనలోకి వస్తుంది. అయితే ఆలయానికి వెళ్ళేటప్పుడు గమనిస్తే శంఖం ఊదుతూ ఉంటారు. ఎక్కువగా శివాలయాల్లో శంఖంని ఉంటారు. కొంతమంది అయితే ఇళ్లల్లో శంఖాన్ని పెట్టి ఊదుతూ ఉంటారు. అయితే అసలు ఎందుకు శంఖం ఊదాలి..? శంఖం ఊదితే ఎలాంటి ఫలితం ఉంటుంది.. అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
శంఖానికి చాలా ప్రాధాన్యత ఉంది. భారతీయ పురాణ ఇతిహాసాలలో శంఖానికి ఉన్న ప్రాధాన్యత ఇంతా అంతా కాదు. సముద్ర గర్భంలో దొరికే ఈ శంఖానికి భగవంతుడితో ఎంతో అనుబంధం ఉంది. క్షీరసాగర మధనంలో శంఖం ముందు పుట్టి ఆ తర్వాత లక్ష్మీదేవి ఉద్భవించిందట. శంఖం నుండి ఓంకార శబ్దం వెలువడుతుంది. శంఖానికి నిజంగా ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది.
యుద్ధాలు వంటివి మొదలయ్యేటప్పుడు శంఖాన్ని పూరించి ఆ తర్వాత మొదలు పెడతారు. అయితే ఇలా శంఖాన్ని పూరించడం శుభసూచకంగా భావిస్తారు. శంఖం శబ్దంతో మంచి జరుగుతుందట. శుభం జరుగుతుందట. సమస్యలు తొలగిపోతాయి. అడ్డంకులు తొలగిపోతాయి. ప్రతిరోజూ నాలుగు సార్లు శంఖాన్ని ఇంట్లో ఊదినట్లయితే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది.
ప్రతికూల వాతావరణం పూర్తిగా మాయమై పోవాలంటే కచ్చితంగా ఇంట్లో శంఖాన్ని ఊదండి. శంఖాన్ని ఊదడం వలన వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి. ఇంట్లో పెట్టి శంఖంని పూజిస్తే సుఖసంతోషాలు ఉంటాయి. లక్ష్మీదేవి ఇంట కొలువై ఉంటుంది. ఎంతో ఆనందం ఉంటుంది. మానసికంగా కూడా హాయిగా ఉంటుంది. ఇలా శంఖం వలన ఎన్నో లాభాలు ఉంటాయి. కాబట్టి కచ్చితంగా ఇంట్లో పెట్టి పూజించండి.
వ్యాపార వేత్త సోహైల్ ఖతురియాతో విడాకులు తీసుకున్న అనంతరం హన్సిక మోత్వాని గోల్డెన్ టెంపుల్‌ను సందర్శించి ఇన్‌స్టాగ్రామ్‌లో కీలక పోస్టు…
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…