Ganesh Chaturdhi 2023 : హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండగలలో వినాయక చవితి కూడా ఒకటి. వినాయక చవితి నాడు హిందువులందరూ వినాయకుడి పూజ చేసుకుంటారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు వినాయక చవితిని అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. చిన్న వాళ్ల మొదలు పెద్దవాళ్ల వరకు అందరికీ వినాయక చవితి అంటే ఎంతో ఇష్టం. దాదాపు మూడు రోజుల నుండి 11 రోజుల వరకు ఈ పండుగని జరుపుతారు. వినాయకుడు భాద్రపద మాసంలోని శుక్లపక్ష చతుర్థి రోజున పుట్టాడు. ఈ సంవత్సరం వినాయక చవితి ఎప్పుడు వచ్చిందా అని చాలామంది పదే పదే పండితుల్ని అడగడం, పంచాంగాలని తిరగేయడం చేస్తున్నారు.
అయితే ఈ సంవత్సరం పండుగ ఎప్పుడు వచ్చిందో క్లారిటీగా తెలుసుకుందాం. ఈ సంవత్సరం సెప్టెంబర్ 18వ తేదీతోపాటు 19న కూడా తిథి వుంది. వినాయక చవితిని కొందరు 18న జరుపుతుండగా, కొందరు 19న జరుపుకుంటున్నారు. సెప్టెంబర్ 28న నిమజ్జనం చేస్తారు. పంచాంగం ప్రకారం తిథి సెప్టెంబర్ 18వ తేదీ మధ్యాహ్నం 12:39 గంటలకి మొదలయ్యి మరుసటి రోజు అనగా సెప్టెంబర్ 19వ తేదీ రాత్రి 8:43 గంటలకి ముగుస్తుంది.
కనుక సెప్టెంబర్ 19న వినాయక చవితి జరుపుకోవాలని అంటున్నారు. కానీ కాణిపాకంలో, భాగ్యనగరంలో సెప్టెంబర్ 18న చేస్తున్నారు. నవరాత్రులలో కూడా వినాయకుడిని పూజిస్తూ ఉంటారు. 11వ రోజు నియమాల ప్రకారం భక్తిశ్రద్ధలతో వినాయకుడిని నిమజ్జనం చేస్తారు. వినాయక చవితి నాడు వినాయకుడికి ఇష్టమైన గరికను కచ్చితంగా పెట్టాలి. అలాగే నైవేద్యంగా కుడుములు, ఉండ్రాళ్ళు చెరుకుతోపాటు పండ్లని కూడా నైవేద్యం పెట్టాలి.
చాలామంది వినాయక చవితి నాడు పాలవెల్లి కడుతూ ఉంటారు. పాలవెల్లకి రకరకాల పండ్లు కట్టాలి. మొక్కజొన్న పొత్తులు, మారేడు కాయ, వెలగ వంటివి కూడా పెడుతూ ఉంటారు. వినాయక చవితి నాడు వినాయకుడికి ఇష్టమైన ఎర్రమందారాలు, ఎర్రటి పూలతో పూజ చేస్తే మంచిది. ఇలా వినాయకుడిని ఆరాధిస్తే వినాయకుడు మీ కోరికలని నెరవేరుస్తాడు.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…