Hanuman Chalisa : రాత్రి పూట‌ హనుమాన్ చాలీసా చదివితే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

August 8, 2023 5:06 PM

Hanuman Chalisa : చాలా మంది హనుమాన్ చాలీసాని చదువుతూ ఉంటారు. హనుమాన్ చాలీసా చదవడం వలన అనేక లాభాలని పొందొచ్చు. మరి హనుమాన్ చాలీసాని చదివితే ఎలాంటి లాభాలని పొందొచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. తులసీదాస్ అందించిన హనుమాన్ చాలీసాని చాలా మంది చదువుతూ ఉంటారు. హనుమాన్ చాలీసాకి ప్రత్యేక స్థానం ఉంది. హనుమంతుడిని మెప్పించిన హనుమాన్ చాలీసాని చదవడం వలన శని ప్రభావం పోతుంది.

హనుమాన్ చాలీసా చదవడానికి, ఒక పద్ధతి కూడా ఉంది. ప్రతి శ్లోకానికి ప్రత్యేక అర్థం ఉంది. హనుమాన్ చాలీసా చదివితే, ఆ వ్యక్తిపై అద్భుత ప్రభావం పడుతుంద‌ని అంటారు. పొద్దున్న కానీ రాత్రి కానీ హనుమాన్ చాలీసా చదవచ్చు. ఈ సమయాల్లో హనుమాన్ చాలీసా చదివితే, చక్కటి ఫలితం ఉంటుంది. శని ప్రభావం ఉన్న వాళ్లు, ప్రతిరోజూ రాత్రి హనుమాన్ చాలీసాని ఎనిమిది సార్లు చదివితే, చక్కటి ఫలితం కనపడుతుంది.

read Hanuman Chalisa at night for these benefits
Hanuman Chalisa

8 సార్లు హనుమాన్ చాలీసాని చదవడం వలన పాపాలు తొలగిపోతాయి. రాత్రిళ్ళు హనుమాన్ చాలీసా చదివితే, దుష్టశక్తుల నీడ మీపై నుండి తొలగిపోతుంది. మీ పిల్లలకి దెయ్యాల మీద భయం ఉంటే, హనుమాన్ చాలీసా చదవండి. అప్పుడు భయం పోతుంది. హనుమాన్ చాలీసా చదివితే, హనుమంతుడు మీ కష్టాల నుండి మిమ్మల్ని బయటపడేస్తాడు.

ఏదైనా పనిలో విజయాన్ని సాధించాలనుకుంటే, మంగళవారం, గురువారం, శనివారం లేదా మూల నక్షత్రం ఉన్న రోజుల్లో రాత్రి పూట హనుమాన్ చాలీసాని 108 సార్లు చదివితే మంచిది. ఇలా హనుమాన్ చాలీసాని చదవడం వలన చక్కటి ఫలితం కనపడుతుంది. కష్టాలన్నీ పోతాయి. భయం ఏమీ ఉండదు. ఇబ్బందుల నుండి బయటపడ‌వ‌చ్చు. హనుమంతుడి అనుగ్రహం కలిగి అన్ని పనుల్లోనూ విజయాన్ని పొందుతారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment