Ravan And Sita : నేటి తరుణంలో రామాయణం అంటే తెలియని వారు ఎవరు. చాలా మందికి దీని గురించి తెలుసు. రాముడి 14 ఏళ్ల అరణ్యవాసం, రావణుడు సీతను ఎత్తుకెళ్లడం, అతన్ని వధించి సీతను మళ్లీ వెనక్కి తెచ్చుకోవడం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో శ్లోకాలు, పద్యాలతో కూడుకుని ఆ పురాణం ఉంటుంది. రామాయణం, అందులోని విశేషాలు, సంఘటనలు చాలా మందికి తెలిసినప్పటికీ దాదాపుగా అనేక మందికి తెలియని విషయం ఇంకోటుంది. అదేమిటంటే..
రావణుడు సీతను ఎత్తుకెళ్తాడు కదా. కొన్ని నెలల పాటు తన వద్దే ఆమెను నిర్బంధిస్తాడు. అనంతరం రాముడు సీతను వెతుక్కుంటూ వచ్చి రావణున్ని సంహరించి ఆమెను తీసుకెళ్తాడు. అయితే రావణుని వద్ద సీత ఉన్న సమయంలో ఆమెను రావణుడు కనీసం ముట్టుకోను కూడా లేదు. అవును, మీరు విన్నది కరెక్టే. ఇప్పటి విలన్లలాగా అయితే అలాంటి మహాతల్లికి ఎప్పుడో ఆపద సంభవించి ఉండేది. కానీ అంతటి రాక్షసుడు అయి ఉండి కూడా రావణుడు సీతమ్మను అస్సలు తాకలేదు. ఎందుకంటే..
మీకు రంభ తెలుసు కదా. ఇంద్రుడి దగ్గర స్వర్గంలో ఉంటుంది. నిత్యం గానా భజానాలు, మేజువాణీలు.. అబ్బో ఆ వైభోగమే వేరు. అయితే రావణుడు సీతను తీసుకురావడానికి చాలా సంవత్సరాల ముందే అతను ఓసారి స్వర్గానికి వెళ్తాడట. అప్పుడు అక్కడ ఉన్న రంభను చూసి రావణుడు మనసు పారేసుకుంటాడు. తనతో గడపాలని ఆమెను బలవంతం చేస్తాడు. అందుకు రంభ ఒప్పుకోదు. అయినా రావణుడు వదిలి పెట్టకుండా ఆమె వెంట పడతాడు.
ఈ క్రమంలో అది చూసిన రంభ ప్రియుడు నలకుబేరుడు రావణుడికి శాపం పెడతాడు. ఇష్టం లేకున్నా ఎవరైనా యువతులను ముట్టుకోవడానికి ప్రయత్నిస్తే అతని తలలు పగిలిపోతాయని అంటాడు. దీంతో చేసేది లేక రావణుడు వెనక్కి తగ్గుతాడు. అప్పటికది అయిపోయినా ఆ శాపం అతన్ని వెంటాడుతూనే ఉంటుంది. అందులో భాగంగానే సీతను ఎత్తుకెళ్లినా అన్ని నెలల పాటు తన వద్ద బందీగా పెట్టుకున్నా ఆమెను కనీసం తాకను కూడా తాకలేకపోతాడు. దాని వెనుక ఉన్న అసలు కారణం అది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…