ఆధ్యాత్మికం

Pratyangira Mantram : ఎవడైనా మీ జోలికి వస్తే ఈ మంత్రం చదవండి.. అంతే.. శత్రువులు నశిస్తారు..

Pratyangira Mantram : మనుషులు తమ జీవితంలో చేసే పనులకు గాను మిత్రులు ఏర్పడుతుంటారు, శత్రువులు తయారవుతుంటారు. మిత్రులు మన మంచి కోరితే శత్రులు మాత్రం మన అంతం కోరతారు. మనల్ని అన్ని విధాలుగా నాశనం చేసేందుకు చూస్తుంటారు. శత్రువులు ఉండాలని ఎవరూ కోరుకోరు. కానీ కొందరికి శత్రువులు ఏర్పడుతుంటారు. దీంతో సమస్యలను కొని తెచ్చుకున్నవారు అవుతారు. అయితే ఇలాంటి బాధలు ఉన్నవారు ఇప్పుడు చెప్పబోయే మంత్రాలను పఠిస్తూ పరిహారం చేస్తే చాలు.. దాంతో శత్రువులు మిమ్మల్ని చూడాలంటనే భయపడిపోతారు. శత్రువుల బాధ ఉండదు. వారి పీడ వదిలిపోతుంది. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

శత్రువుల నుంచి రక్షణ పొందడానికి, శత్రు నిర్మూలనకు, శత్రు బాధలు తొలగిపోవడానికి కింది పరిహారాలను పాటించాల్సి ఉంటుంది. మల్లె పువ్వులతో అమావాస్య రోజున కాళికా దేవిని పూజించాలి. దీంతో ఎలాంటి శత్రు బాధలు అయినా సరే పోతాయి. అలాగే శత్రువులు ఇబ్బందులకు గురి చేస్తుంటే.. నాలుగు జీడి గింజలను తీసుకుని భైరవ లేదా ప్రత్యంగిరా మంత్రాన్ని 11 సార్లు పఠించాలి. అనంతరం ఊరి బయట తుమ్మ చెట్టు మొదట్లో వాటిని పాతి పెట్టాలి. అలా పాతి పెట్టే సమయంలో మీ శత్రువు పేరును 11 సార్లు ఉచ్చరించాలి. దీంతో వారి పీడ వదిలిపోతుంది.

Pratyangira Mantram

ఒక తెల్లని పేపర్‌పై మీ శత్రువు పేరు, అతని తల్లి పేరును బొగ్గుతో రాసి ఊరి బయట శ్మశానంలో పాతి పెట్టాలి. దీంతో శత్రు బాధలు తొలగిపోతాయి. చేతిలో తెల్ల ఆవాలని తీసుకుని 11 సార్లు.. ఉగ్రం వీరం మహా విష్ణుం, జ్వలంతం సర్వతోముఖం, నృసింహం భీషణం భద్రం, మృత్యుర్‌ మృత్యుమ్‌ నమామ్యహం.. అన్న నృసింహ మంత్రంతో మంత్రించి మీ ఇంటి ఆవరణలో, నలు మూలల్లో, నాలుగు దిక్కుల్లో చల్లడం వల్ల మీ శత్రువు మిమ్మల్ని బాధించడు. శత్రువు పేరు, తల్లి పేరు భోజ పత్రంపై గంధంతో రాసి తేనె సీసాలో పెట్టి మూత బిగించి పూజ గదిలో పెట్టండి. శత్రువులు నిర్వీర్యులై మీకు హాని చేయకుండా ఉంటారు. శత్రువు పేట్రేగి పోతుంటే మీ ఇంటి బయట మంట పెట్టి ఎండు మిరపకాయలు ఐదు తీసుకుని మీపై నుంచి 5 సార్లు శత్రువు పేరు చెబుతూ తిప్పి ఇంటి బయట కాలుతున్న మంటలో వేయండి. శత్రు పీడ పోతుంది.

కొన్ని తెల్ల ఆవాలను తీసుకుని ఓం భ్రం భైరవాయ నమః అన్న భైరవ మంత్రం చదువుతూ మీ ఇంటికి ఎనిమిది దిక్కులా చల్లండి. మీ శత్రువుల నుంచి భైరవుడు మీకు రక్షణగా ఉంటాడు. శనివారం మిట్ట మధ్యాహ్నం తన ఎత్తుకు సరిపడా ఎత్తులో ఎర్ర దారాన్ని తీసుకుని కొబ్బరి బొండానికి ఆ దారాన్ని చుట్టి పసుపు కుంకుమతో బొండాన్ని అలంకరించి మూడు సార్లు దిష్టి తీసుకుని ప్రవహించే నదిలో వేయాలి. వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి రావాలి. ఇలా ఈ తంత్రాన్ని ఏడు సార్లు చేయాలి. ఆర్థిక నష్టాలు, రుణ బాధలు పోతాయి. శత్రు పీడల నుంచి విముక్తి లభిస్తుంది. శత్రువులు నశిస్తారు. రోగాలు తొలగిపోతాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM