Naga Dosham : నాగదోషం వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయి..? దీని నుండి ఎలా బయట పడవచ్చు..?

December 16, 2023 9:37 AM

Naga Dosham : నాగ దోషం వలన, ఎలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుందనే విషయం చాలామందికి తెలియదు. ఆధ్యాత్మికంగా రాహువు పాము యొక్క శరీరం. మానవతల కలిగి ఉన్నట్లు కనపడతారు. అయితే కేతువు పాము యొక్క తల అలానే మానవ శరీరం కలిగి ఉంటారట. నవగ్రహాలలో సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురు, శుక్రుడు, శని నీడ గ్రహాలైన రాహువు కేతువుల మధ్య ఇరుక్కున్నట్లయితే కాల సర్ప దోషం అనేది ఉంటుంది. సర్ప దోషాలు చాలా రకాలు. నాగదోషం అనేక అడ్డంకులని కలిగించుతుంది.

నాగ దోషం లేదా సర్ప దోషం గురించి ఈరోజు కొన్ని విషయాలను తెలుసుకుందాము. రాహువు, కేతువులు మధ్య గ్రహాలు ఉన్నప్పుడు, పుట్టిన పిల్లలు కాలసర్పదోషంతో బాధపడతారు. గత జన్మలో, పాముకి కానీ ఇతర జంతువులకు కానీ హాని చేసినా లేదా వారసునుగా కానీ నాగ సర్ప దోషానికి గురవుతారు. నాగ దోషం ఉన్నవాళ్లు స్వాతి, శతభిష నక్షత్ర రోజుల్లో ప్రదోషకాలంలో, శివుడికి బిల్వార్చన చేస్తే మంచిది. ప్రతి రోజు దుర్గాదేవి స్తోత్రాలు పటిస్తే ఈ దోషం నుంచి బయటపడవచ్చు. నవగ్రహ పీఠంలోని రాహువుని రోజు పూజిస్తే కూడా ఈ దోషం నుండి బయట పడొచ్చు.

Naga Dosham how it effects what are the remedies
Naga Dosham

యుక్త వయసు వచ్చి, పెళ్లి అవ్వని స్త్రీలు రావి చెట్టు, వేప చెట్టు కలిసే ప్రదేశంలో పాలని వదిలేసి, నాగదేవత విగ్రహానికి అభిషేకం చేస్తే మంచి జరుగుతుంది. రాహులగ్నం మొదటి ఇంట్లో ఉంటే, కేతువు కూడా సప్తమంలో ఉంటాడు. ఇతర గ్రహాలు వాటి మధ్య ఉంటాయి. ఈ దోషం ఉన్నవాళ్లకి, యవ్వన కాలం కష్టంగా ఉంటుంది. కొందరికి పెళ్లిళ్లు జరగవు.

అదే ఒకవేళ రెండవ స్థానంలో ఎనిమిదవ ఇంట రాహువు కేతువు ఉంటే ఆర్థికంగా వెనుకడుగు వేయడం జరుగుతుంది. 32 ఏళ్ళు పైబడిన వారికి ప్రయోజనాలు అయితే ఉన్నాయి. అలానే, పనిలో ఇబ్బందులు రావడం, పుత్ర దోషం, వివాహ సమస్యలు వంటివి కలుగుతాయి, రాహువు తొమ్మిదవ ఇంట, కేతువు మూడవ ఇంట ఉంటే కాలసర్ప దోషం ఉంటుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now