Lord Vishnu : నిత్యం పూజలు చేసినా ఎందుకు సమస్యలు ఉంటాయి..? ఈ ప్రశ్న కి మహావిష్ణువు చెప్పిన సమాధానం ఇది. శ్రీమహావిష్ణువుని ఒక భక్తుడు నిత్యం పూజలు చేసినా ఎందుకు సమస్యలు వుంటాయని అడగగా.. ఆయన ఇలా చెప్పారు. నీలాగే నారదుడు కూడా నన్ను ఒకసారి ఇదే ప్రశ్న అడిగాడని.. అప్పుడు నారదుడితో ఇలా చెప్తారు. నారద మనం ఇద్దరం బ్రాహ్మణ వస్త్రాలను ధరించి భూలోకంలో సంచరించి వద్దాం. అప్పుడు మహా విష్ణువు, నారద మహర్షులు వారు భూలోకంలో సంచరిస్తూ ఉంటారు. అలా వెళ్తున్నప్పుడు వారికి ఒక పెద్ద భవంతి కనబడింది. వారు అక్కడికి వెళ్తారు. బాగా ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా ఇస్తారా అని విష్ణు మూర్తి అడుగుతారు.
ఆ ఇంటి యజమాని బయటికి వచ్చి ఏంటని అడుగుతారు. మాకు బాగా ఆకలిగా ఉంది. ఏమైనా పెడతారా అని అడుగుతారు. మీ బాబు సొమ్ము ఏమైనా ఇక్కడ దాచారా అని ఆ సేటు అడుగుతాడు. పైగా ఇక్కడ నుండి బయలుదేరండి అని చెప్తాడు. నారదుడు శ్రీమహావిష్ణువు చేతుల్ని పట్టుకుని, స్వామిని బయటకు తీసుకువచ్చి, ఆయన ఇంత అవమానించినా మీరు ఎందుకు ఏమీ అనడం లేదు..? అతన్ని శపించండి అని అంటాడు. శ్రీమహావిష్ణువు వెంటనే రెండు చేతుల్ని పైకి ఎత్తి, నీకు ధనం చాలా రావాలి.
నీ వ్యాపారం ఇంకా అభివృద్ధి చెందాలి. సంపద పెరగాలి అని వరం ఇస్తాడు. మిమ్మల్ని తిట్టి వెళ్లిపోమంటే మీరేంటి ఇలా అంటున్నారు అని నారదుడు అంటారు. దానికి స్వామి పద నారదా మనం వెళ్ళిపోదాం అంటారు. అలా వాళ్ళు ముందుకు వెళ్లగా, అక్కడ ఒక పూరి గుడిసె కనబడింది. అక్కడ ఒక అమ్మ కూర్చుని ఉంటుంది. ఆకలిగా ఉంది ఏమైనా పెట్టమ్మా అని అడుగుతారు. తినడానికి ఏమీ లేదు కానీ ఒక ఆవు ఉంది. సేవ చేసుకోవడం వలన రోజు నాకు అది పాలిస్తుంది. ఆ పాలు ఉన్నాయి. రండి అని ఆమె కూర్చో పెడుతుంది. ఆకలి తీర్చింది.
అప్పుడు నారదుడు ఈ తల్లికి ఆశీర్వాదం ఇవ్వండి అని అంటారు. ఆవు చనిపోవాలని మహావిష్ణువు అంటారు. అప్పుడు నారదుడు నాకు మీ స్వరూపం నచ్చడం లేదు. అవమానించిన వాళ్ళకి ఏమో మీరు మంచి జరగాలని దీవించారు. ఈమెకేమో ఆవు చనిపోవాలని కోరుకుంటున్నారు అని అంటారు. ఎందుకు ఇలా దీవించారంటే.. ఆమె నిత్యం నన్నే కొలుస్తూ ఉంటుంది పైగా రోజు ఆవుకి సేవ చేస్తుంది.
నేను చనిపోయాక నా ఆవు ఏమవుతుంది అని ఆమె బాధ పడి చనిపోతుంది. అందుకే అలా చెప్పానని స్వామి అంటారు. అయితే మరి సేటుకి ఎందుకు ఇలా దీవించారని అడిగితే, అతనికి ధనం మీద చాలా ప్రేమ ఉంది. అతనికి లక్ష్మీ వృద్ధి చెందాలని ఆశీర్వదించాను. డబ్బులు మూటలు మూటలు కట్టీ కట్టీ ఒకరోజు చనిపోతాడు. ఆ డబ్బు యొక్క ధ్యాస లోనే ఆ డబ్బు మీద ప్రేమతోనే.. డబ్బు మీద ప్రీతితోనే.. ఆ ఆలోచనతోనే చనిపోతాడు. సుఖ లోకాలు కలగవు అని చెప్తారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…