Lord Shiva : చాలా చోట్ల లింగ రూపంలోనే కనిపించే శివుడు ప్రముఖ క్షేత్రాల్లోనే విగ్రహరూపంలో దర్శనమిస్తాడు. కానీ నిద్రించే భంగిమంలో, తలకిందులుగా ఉన్న భంగిమలో శివుడు మన తెలుగు రాష్ట్రాల్లో దర్శనమిస్తున్నాడు. అదెక్కడో.. ఆ విశేషాలేంటో చూడండి. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా నాగులాపురం మండలం సరటుపల్లిలో మనకు పడుకుని ఉన్నమహాశివుడు కనిపిస్తాడు. క్షీరసాగరమథనం అప్పుడు లోకకళ్యాణం కోసం హలాహలాన్ని మింగిన శివుడు విషప్రభావం వల్ల కాసేపు స్పృహ తప్పిపడి పోయి అమ్మవారి ఒడిలో సేదతీరుతుంటే.. కంగారు పడిన దేవతలు శయనరూపంలో ఉన్న శివున్ని సేవించుకున్నారని చెబుతారు.
అప్పుడు తన కంఠంలో ఉన్న గరళాన్ని అందరికీ చూపించి అభయమిచ్చాడని స్థల పురాణం. ఈ ప్రాంతానికి సురులు వచ్చి శివున్ని పూజించినందున సురులపల్లిగా, కాలక్రమేణా సురుల పల్లి సరటుపల్లిగా మారింది. శివరాత్రి రోజున ఈ శివున్ని దర్శిస్తే ఆరోగ్య సమస్యలు పోతాయని భక్తుల విశ్వాసం. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం యనమదుర్రులో శివుడు తలకిందులుగా తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఈ గుడికి వందల సంవత్సరాల చరిత్ర ఉంది. శీర్షాసనంలో తపస్సు చేస్తున్న శివుడి జటాజుటం నేలకు తగులుతూ ముఖం, పాదాలు, ఉదరం, మోకాళ్లు పైకి ఉండి పక్కనే అమ్మవారు కొలువై ఉంటుంది. జగన్మాత పార్వతిదేవి నెలల పిల్లాడయిన కుమారస్వామిని ఒడిలో లాలిస్తున్నట్లు ఉండడం ప్రత్యేకత.
ఈ గుడి వెనుక ఒక పురాణకథ ఉంది. లోకాన్ని పట్టి పీడిస్తున్న శంభరున్ని అంతం చేయాలనుకున్న యమధర్మరాజు.. శంభరుడు శివుని భక్తుడని శంభరున్ని అంతంచేయాలంటే శివుడి ఆజ్ఞ తీసుకోవాలని శివుడి గురించి తపస్సు చేస్తాడు. అదే సమయంలో కైలాసంలో తలకిందులుగా తపస్సు చేస్తున్నశివుడు, పక్కనే బాలింత పార్వతీ దేవి యమధర్మరాజు తపస్సు చేస్తున్నచోట ప్రత్యక్షం అయ్యారని పురాణకథ. యమధర్మరాజే స్వయంగా ఇక్కడ శివున్ని ప్రతిష్టించి గుడి కట్టి గుడికెదురుగా ఒక కోనేరుని ఏర్పాటు చేశాడని, ఈ కోనేరులో స్నానం చేసి ఆ శివున్ని దర్శించుకుంటే అకాల ప్రాణభయం ఉండదని భక్తుల విశ్వాసం.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…