Lakshmi Devi : లక్ష్మీదేవిని పూజిస్తే ధనంతోపాటు శుభాలు కూడా కలుగుతాయని అందరికీ తెలిసిందే. ఎందుకంటే హిందూ పురాణాల ప్రకారం లక్ష్మీదేవి ధనానికి, ఐశ్వర్యానికి అధిపతి. ఆమెను పూజిస్తే అన్నీ శుభాలే కలుగుతాయని, ధనం మిక్కిలిగా సమకూరుతుందని చాలా మంది నమ్మకం. వ్యాపారస్తులైతే తమ దుకాణాల్లో, షాపులలో, ఇతర ప్రదేశాల్లో లక్ష్మీదేవి చిత్రపటాన్ని కచ్చితంగా పెట్టుకుంటారు. అలా చేస్తే వ్యాపారంలో బాగా డబ్బు సంపాదించవచ్చని వారి నమ్మకం. అయితే లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధించాలంటే పూజ మాత్రమే కాదు, ఇంకా కొన్ని పనులు కూడా చేయాల్సి ఉంటుందట. అప్పుడు ఆ దేవి కటాక్షం ఇంకా ఎక్కువగా కలుగుతుందట. ఈ క్రమంలో లక్ష్మీదేవి కోసం ఏమేం పనులు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఓ నెమలి ఫించాన్ని తెచ్చుకుని దాన్ని ఇంట్లో మీరు లక్ష్మీదేవిని పూజించే దగ్గర పెట్టుకోవాలి. దీంతో ఆ దేవి అనుగ్రహం లభిస్తుందట. ఎందుకంటే సరస్వతీ దేవి కూర్చునేది నెమలిపైనే కదా. అంతేకాదు, నెమలి ఫించాన్ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల నెగెటివ్ శక్తి అంతా వెళ్లిపోయి పాజిటివ్ శక్తి వస్తుందట. అది మనకు చాలా మేలు చేస్తుందట. బంగారం లేదా వెండితో చేసిన నాణాన్ని పూజ గదిలో ఉంచాలి. ఆ నాణంపై లక్ష్మీ దేవి, వినాయకుడు ఉంటే ఇంకా చాలా మంచిదట. దాంతో మిక్కిలిగా సంపద కలుగుతుందట.
తామర పూవులంటే లక్ష్మీ దేవికి ఎంతో ఇష్టమట. ఆ దేవి తామరపూవు పైనే కూర్చుంటుంది కాబట్టి దాంతో ఆమెను పూజిస్తుంటే అన్నీ లాభాలే కలుగుతాయట. ధనం బాగా సమకూరుతుందట. లక్ష్మీదేవి తామరపూవు మీద కూర్చుని ఉండి సిరులు కురిపిస్తున్నట్టుగా ఉండే చిత్రపటం లేదా ప్రతిమను ఇంట్లో పెట్టుకుని నిత్యం పూజించాలి. దీంతో సిరులు కురుస్తాయట. ఇంట్లోని వారందరికీ అంతా మంచే జరుగుతుందట. మహిళలు నుదుట ధరించే కుంకుమ, చేతులకు ధరించే గాజులు, గోరింటాకు వంటి పలు రకాల అలంకరణ వస్తువులను ఇంట్లో ఉంచాలట. దీంతో ఆ ఇంట్లోని వారికి అంతా మంచే జరిగి సంపద సిద్ధిస్తుందట.
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్‌గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్‌లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్‌కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…