Kamaskhi Temple : మన భారతదేశంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి. ఒక్కో ఆలయానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. కంచి కామాక్షి అమ్మవారి ఆలయం గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కంచి కామాక్షి అమ్మవారి ఆలయానికి ఎంతోమంది భక్తులు వస్తూ ఉంటారు. హిందూ ధర్మంలో అమ్మవారు కూడా వివిధ రూపాలలో ఉంటారు. ఆ రూపాలలో పూజలు కూడా అందుకుంటారు. అమ్మవారిని నమ్మి, కోరి కొలిచిన భక్తులపై కచ్చితంగా అమ్మవారి కటాక్షం లభిస్తుంది. అమ్మవారు కరుణ చూపిస్తారు. అమ్మవారు భక్తులని కాపాడతారు.
కాంచీపురంలో వెలసిన కామాక్షి తల్లిని దర్శించుకుంటే, మన కష్టాలన్నీ గట్టెక్కిపోతాయి. తల్లిని దర్శించుకోవడానికి ఎన్నిసార్లు భక్తులు సంకల్పించుకున్నా వెళ్లలేరట. కంచి కామాక్షి తల్లిని దర్శించుకోవడానికి, మానవ సంకల్పం చాలదు. తల్లి సంకల్పమే ప్రధానం. సమస్త భూమండలానికి నాభి స్థానం కంచి. తల్లి గర్భంలో ఉన్నప్పుడు, మన నాభి నుండే తల్లి పోషిస్తుంది. కామాక్షి తల్లిని దర్శించుకుంటే, కష్టాలు ఏమీ ఉండవు. ఇక్కడ సుగంధ కుండలాంబ అవతారంలో అమ్మవారిని దర్శించుకోవచ్చు. ప్రపంచంలో ఎక్కడా కూడా ఇలాంటి రూపం ఉండదు. ప్రపంచంలో ఎక్కడ దర్శించలేని విధంగా ఇక్కడ ఢంకా వినాయకుడు ఉంటాడు.
అలాగే కామాక్షి ఆలయంలో అరూపా లక్ష్మీ దేవి దర్శనం ఇస్తుంది. కామాక్షి తల్లిని దర్శించుకున్న తర్వాత ఆ కుంకుమ ప్రసాదాన్ని అరూపా లక్ష్మి తల్లికి ఇచ్చి ప్రసాదంగా తీసుకుంటే భర్తని నిందించిన దోషమంతా కూడా పోతుంది. స్త్రీ, పురుషులు ఎవరైనా కూడా అరూపా లక్ష్మీ తల్లిని దర్శించుకోవచ్చు. అప్పుడు శాప విమోచనం అవుతుంది.
కామాక్షి దేవి ప్రధాన ఆలయానికి పక్కన ఉత్సవ కామాక్షి తల్లికి ఎదురుగా ఒక గోడ ఉంటుంది. ఆ గోడలో తుండిరా మహారాజు వుంటాడు. శివుడికి నంది ఎలాగో అలా అమ్మకి ఎదురుగా ఉంటాడు. కాత్యాయనీ దేవి శివుడిని భర్తగా పొందడానికి, కాంచీపురం క్షేత్రంలో తపస్సు చేస్తుంది. ఇంతటి విశిష్టత ఈ ఆలయానికి ఉంది. ఈ ఆలయానికి వెళితే ఎలాంటి కష్టమైనా సరే పోతుందని భక్తులు విశ్వసిస్తారు.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…