Deeparadhana : సాయంత్రం పూట దీపారాధన‌ చేయాలంటే.. స్నానం చెయ్యాలా..?

November 4, 2023 9:39 PM

Deeparadhana : ప్రతి ఒక్కరూ కూడా, రోజు ఇంట్లో పూజ చేస్తూ ఉంటారు. పూజ చేసి దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు. ఉదయం పూట ప్రతి ఒక్కరికి కూడా దీపం పెట్టాలని, పూజ చేయాలని తెలుసు. అయితే, సాయంత్రం పూట కూడా దీపాన్ని వెలిగించాలా అనే సందేహం, చాలా మందికి ఉంది. గృహిణికి ఉదయం పూట, స్నానం చేయాలి అని, మాత్రమే ధర్మం చెప్తోంది. సూర్యాస్తమయానికి, 48 నిమిషాల కంటే, ప్రారంభ సమయంలో అంటే, పూర్తిగా చీకటి పడదు. కొద్దిగా వెలుతురు ఉంటుంది. ఆ సమయంలో కాళ్లు, చేతులు కడుక్కోవాలి.

కాళ్లు, చేతులు శుభ్రంగా కడుక్కుని, ముఖం కూడా కడుక్కుని, మళ్ళీ బొట్టు పెట్టుకుని ఉదయం నుండి వేసుకున్న దుస్తులను మార్చేసుకుని, దేవతగృహంలోకి వెళ్లి తైలంతో దీపారాధన చేయాలి. ఆ తర్వాత శ్లోకాలు ఏమైనా తెలిసి ఉంటే చదువుకోవాలి. ఇంట్లో వాళ్లంతా ఒక చోట కూర్చుని, పిల్లల్ని కూడా కూర్చోబెట్టి శ్లోకాలు, పద్యాలు, దండకములు చెప్పించాలి. ఇలా, సూర్యస్తమయం సమయాన్ని గడిపితే చాలా మంచి జరుగుతుంది.

if you are doing Deeparadhana in the evening must know this
Deeparadhana

జ్యోతి కాంతులని మనం ఆరాధన చేసేటప్పుడు, మనం చెప్పుకోవాల్సిన శ్లోకాలు, స్తోత్రాలు చాలా ఉన్నాయి. వాటిని చెప్పుకుని కూర్చుంటే, ఎంతో మంచి జరుగుతుంది. పత్తి వత్తులతో దీపారాధన చేస్తే పితృదేవతా దోషాలు తొలగిపోతాయి. అరటినార వత్తులతో దీపారాధన చేస్తే, కుటుంబ శాంతి, మంచి సంతానం, కుల దైవం అనుగ్రహం కలుగుతాయి. తామర వత్తులతో దీపారాధన చేస్తే, లక్ష్మి కటాక్షం కలుగుతుంది.

జిల్లెడు వత్తులతో దీపారాధన చేస్తే వినాయకుని అనుగ్రహం కలుగుతుంది. దుష్టశక్తుల పీడ నివారణ అవుతుంది. సిరిసంపదలు కలుగుతాయి. పసుపు నీటితో తడిపిన కొత్త బట్ట వత్తులతో దీపారాధన చేస్తే, ఉదర సంబంధిత వ్యాధులు వుండవు. అమ్మకటాక్షం ఉంటుంది. కుంకుమ నీటితో తడిపిన కొత్త బట్ట వత్తులతో దీపారాధన చేస్తే, వైవాహిక సమస్యలు, సంతానలేమి సమస్యలు వంటివి తొలగిపోతాయి. పన్నీరు అద్దిన వత్తులలో నెయ్యి వేసి, దీపారాధన చేయడం వలన సిరిసంపదలు కలిగి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now