ఆధ్యాత్మికం

Garikapati : మ‌హిళ‌ల వ‌స్త్ర‌ధార‌ణ‌పై గ‌రిక‌పాటి కామెంట్స్‌.. అంత మాట అన్నారేంటి..?

Garikapati : ప్ర‌స్తుత త‌రుణంలో స‌మాజంలో రోజు రోజుకీ మ‌హిళ‌ల‌పై అఘాయిత్యాలు ఎలా పెరిగిపోతున్నాయో అంద‌రికీ తెలిసిందే. ప‌సికందు మొద‌లుకొని వృద్ధ మ‌హిళ‌ల వ‌ర‌కు అంద‌రూ మృగాళ్ల వేధింపుల‌కు బ‌ల‌వుతున్నారు. ప్ర‌భుత్వాలు ఎన్ని క‌ఠిన చ‌ట్టాల‌ను అమ‌లు చేస్తున్నామ‌ని చెబుతున్నా ఈ అకృత్యాలు మాత్రం ఆగ‌డం లేదు. అయితే ఇదే విష‌యంలో చాలా మంది అనేక ర‌కాలుగా త‌మ అభిప్రాయాల‌ను సైతం వ్య‌క్తం చేస్తున్నారు. ముఖ్యంగా మ‌హిళ‌ల వ‌స్త్ర‌ధార‌ణ‌పై ఎప్ప‌టిక‌ప్పుడు చాలా మంది కామెంట్లు కూడా చేస్తున్నారు. అయితే ప్ర‌ముఖ అవ‌ధాని, పండితుడు గ‌రిక‌పాటి న‌ర‌సింహారావు మ‌హిళ‌ల వ‌స్త్ర‌ధార‌ణ‌పై చేసిన కామెంట్ల‌కు చెందిన వీడియో ఒక‌టి సామాజిక మాధ్య‌మాల్లో ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతోంది.

గ‌రిక‌పాటి న‌ర‌సింహారావు గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఆయన పురాణాలు, ఇతిహాసాల‌కు చెందిన విష‌యాల‌ను మ‌న‌కు అర్థ‌మ‌య్యేలా చెబుతారు. ఆయ‌న ప్ర‌వ‌చ‌నాలు చెబుతున్న‌ప్పుడు అనేక నీతి విష‌యాల‌ను హాస్యంతో బోధిస్తారు. అందుక‌నే ఆయ‌న‌కు అభిమానులు కూడా ఎక్కువే. ఆయ‌న ప్ర‌వ‌చనాల‌ను రోజూ చాలా మంది వింటుంటారు. ఈ క్ర‌మంలో గ‌తంలో ఓ సంద‌ర్భంలో ఆయ‌న ఓసారి అవ‌ధానం చేసిన స‌మ‌యంలో మ‌హిళ‌ల వ‌స్త్ర‌ధార‌ణ‌పై కామెంట్లు చేశారు. ఇంత‌కీ ఆయ‌న ఏమ‌న్నారంటే..

Garikapati

రామాయ‌ణం, భార‌తాల్లో సీత‌, ద్రౌప‌దిల వ‌ల్లే యుద్ధాలు జ‌రిగాయ‌ని అన్నార‌ని కానీ అది స‌రికాద‌ని.. పురుషుల‌కు ఉండే ప‌ర‌స్త్రీ వ్యామోహం వ‌ల్లే వారికి ఆ గ‌తి ప‌ట్టింద‌ని గ‌రిక‌పాటి అన్నారు. అంతేకానీ ఇందులో ద్రౌప‌ది, సీత‌ల త‌ప్పు ఏమీ లేద‌ని, వారిని నిందించ‌రాద‌ని అన్నారు. అలాగే ప్ర‌స్తుత త‌రుణంలో మ‌హిళ‌ల వ‌స్త్ర‌ధార‌ణ స‌రిగ్గా ఉండ‌డం లేద‌న్నారు. అవ‌య‌వాలు అన్నీ క‌నిపించేలా దుస్తులు ధ‌రిస్తున్నార‌ని.. అలా చేస్తే 17 ఏళ్ల పిల్ల‌ల‌కే కాదు.. త‌న‌లాంటి వృద్ధుల‌కు కూడా వ్యామోహం క‌లుగుతుంద‌ని అన్నారు. క‌నుక మ‌హిళ‌ల వ‌స్త్ర‌ధార‌ణ మారాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. అయితే ఈ వీడియో పాత‌దే అయినా మ‌రోసారి సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

పాత ఫ్లాపులని గుర్తు చేస్తూ ట్రోల్ చేస్తే బాధగా ఉంటుంది.. కృతి శెట్టి ఎమోషనల్ కామెంట్స్!

తాను గ‌తంలో చేసిన సినిమాలు చాలా వ‌ర‌కు ఫ్లాప్ అయ్యాయి క‌నుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…

Saturday, 11 April 2026, 8:35 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్‌పై చిరంజీవి ఎమోషనల్.. పరిశ్రమకు ఇది పెద్ద దెబ్బ అంటూ ఆవేదన!

తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన‌ చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంట‌ర్నెట్‌లో…

Friday, 10 April 2026, 6:40 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్.. 5 నిమిషాల యాక్షన్ సీన్ నెట్టింట వైరల్! షాక్‌లో చిత్ర యూనిట్..

తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…

Friday, 10 April 2026, 12:43 PM

ప్రొపగాండా అంటే ఏంటి? ‘ధురంధర్ 2’ విమర్శకులపై సందీప్ రెడ్డి వంగా నిప్పులు!

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధ‌ర్ 2 ది…

Thursday, 9 April 2026, 11:07 PM

‘కిల్లర్’ మిల్లర్ ఇప్పుడు విలన్ అయ్యాడా? డీసీ ఓటమిపై సునీల్ గవాస్కర్ సంచలన విశ్లేషణ..

ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…

Thursday, 9 April 2026, 9:01 PM

చదువు ముఖ్యం, హీరోలు కాదు! యువతకు రజనీకాంత్ హితవు.. కమల్‌తో మూవీపై క్లారిటీ..

ప్ర‌స్తుత త‌రుణంలో యువ‌త హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువ‌గా ఆక‌ర్షిత‌మై చ‌దువుల‌పై శ్ర‌ద్ధ పెట్ట‌డం లేద‌ని, సామాజిక మాధ్య‌మాల వ‌ల్ల…

Thursday, 9 April 2026, 3:13 PM

భాష నేర్చుకుంటేనే నటన ఈజీ.. కయాదు లోహర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

న‌టీన‌టులు మాతృభాష‌లో కాకుండా ఇత‌ర భాష‌ల్లో సినిమాలు చేస్తే ఆయా భాష‌ల‌ను నేర్చుకుంటేనే సౌక‌ర్య‌వంతంగా ఉంటుంద‌ని న‌టి క‌యాదు లోహ‌ర్…

Thursday, 9 April 2026, 11:48 AM

అల్లు అర్జున్ – అట్లీ మూవీ టైటిల్ ‘రాకా’.. బీస్ట్ లుక్‌లో బన్నీని చూశారా?

పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీల కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మొద‌టి చిత్రంగా ఇప్ప‌టి వ‌రకు…

Wednesday, 8 April 2026, 6:19 PM