Durga Devi Saree : అమ్మవారి చీరల‌ను మహిళలు కట్టుకోవచ్చా..? ఏమ‌వుతుంది..?

July 18, 2023 8:12 PM

Durga Devi Saree : మహిళలందరూ అమ్మవారిని పూజిస్తారు. అమ్మ వారిని పూజించి అమ్మ వారి ఆశీస్సులు పొందాలని, కోరిక నెరవేరాలని అనుకుంటారు. అమ్మవారు అనేక ప్రాంతాలలో వివిధ రూపాలు కలిగి ఉంటారు. అమ్మవారిని పూజించడానికి వెళ్లేటప్పుడు మహిళలు కుంకుమ, గాజులు, పువ్వులు, చీర, జాకెట్టు వంటివి అమ్మ వారికి తీసుకు వెళ్లి సమర్పిస్తారు. అయితే ఆ చీరని పూజారుల చేతికి ఇచ్చి అమ్మ వారిని ఆ చీరతో అలంకరణ చేయమని, పూజారులకు చెప్తారు.

ఆ తర్వాత అమ్మ వారికి వేసిన చీరలు అన్నింటినీ కూడా వేలం వేస్తారు. అలా వేసిన అమ్మవారి చీరల‌ని సాధారణ మహిళలు వేసుకోవచ్చా..? వేసుకోకూడదా..? చాలా మందిలో ఈ సందేహం ఉంటుంది. అమ్మవారి చీరని ధరించ వచ్చా అని.. ఈ విషయం గురించి ఆధ్యాత్మిక గ్రంథాలు ఏం అంటున్నాయనేది చూస్తే.. చీరలని అమ్మవారికి వేశాకా వాటిని ధరించవచ్చని చెప్తున్నాయి. కానీ వీటిని ధరించేటప్పుడు కొన్ని నియమాలని పాటించాలి.

Durga Devi Saree can women wear them
Durga Devi Saree

అమ్మవారి శేష వస్త్రాన్ని వేసుకునేటప్పుడు తిథి, వర్జ్యం చూసుకుని శుక్రవారం నాడు అమ్మవారి చీరని ధ‌రించ‌వ‌చ్చు. అది కూడా ఉదయం పూట కొంత సేపు కట్టుకోవాలి. ఈ చీరని ధరించినప్పుడు ప్రశాంతత కలుగుతుంది. మనకి ఎంతో ప్రశాంతత‌ లభిస్తుంది. ఆలోచనలు చ‌క్క‌గా వ‌స్తాయి. ఈ చీరని రాత్రిపూట మాత్రం అస్సలు కట్టుకోకూడదు. ఆ చీరని ఉతికినప్పుడల్లా నీటిని ఎక్కడ పడితే అక్కడ కాకుండా మొక్కలకి పోసేయాలి.

ఇలా ఇటువంటి నియమాలని అమ్మ వారి చీరని కట్టుకునేటప్పుడు పాటించాలి. శుక్రవారం నాడు ప్రత్యేకించి అమ్మ వారిని పూజిస్తే చక్కటి ఫలితాన్ని పొందవచ్చు. మహిళలందరూ శుక్రవారం నాడు అమ్మ వారిని పూజించి అమ్మ వారి ఆశీస్సుల్ని పొందితే అనుకున్నవి పూర్తవుతాయి. కోరికలు నెరవేరుతాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment