కదిలే శివలింగం ఉన్న ఆలయం ఎక్కడ ఉందో తెలుసా ?

August 18, 2021 12:09 PM

సాధారణంగా గర్భగుడిలో ప్రతిష్టించిన విగ్రహాలు ప్రతిష్టించిన చోట స్థిరంగా ఉండి భక్తులకు దర్శనం ఇస్తుంటాయి. కానీ ప్రతిష్టించిన విగ్రహాలు కదలడం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా. అసలు ప్రతిష్టించిన విగ్రహాలు కదులుతాయని వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఈ ఆలయంలో వెలసిన శివలింగం మాత్రం కదులుతూ భక్తులకు దర్శనమిస్తుంది. మరి కదిలే శివలింగ ఆలయం ఎక్కడ ఉంది, ఆలయ విశిష్టత ఏమిటో ఇక్కడ తెలుసుకుందామా..

కదిలే శివలింగం ఉన్న ఆలయం ఎక్కడ ఉందో తెలుసా ?

ఉత్తర్ ప్రదేశ్ లోని దియోరియా జిల్లా రుద్రపూర్ అనే గ్రామంలో దుగ్దేశ్వర్నాథ్ అనే శివలింగం కొలువై భక్తులను దర్శనమిస్తోంది. ఈ శివలింగం మహాకాళేశ్వర జ్యోతిర్లింగానికి ఉపలింగం అని భావిస్తారు. ఈ ఆలయంలో వెలసిన లింగం కదులుతూ భక్తులకు దర్శనం ఇవ్వడమే ఈ లింగం ప్రత్యేకత. సుమారు 2 వేల సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఆలయంలో స్వామి వారి శివలింగం ఎప్పుడు కదులుతుంది అనేది ఎవరికీ తెలియదు.

స్వామివారి శివలింగాన్ని మనం చేతులతో ఎంత కదిపినా కదలదు. ఈ లింగం దానంతట అదే కదులుతూ భక్తులకు దర్శనమిస్తూ వుంటుంది.ఈ విధంగా పూజారులు పూజ చేసే సమయంలో స్వామివారి లింగం కదులుతూ కనిపించడంతో ఈ విషయం తెలిసిన భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుంటారు. స్వామివారి లింగం కదలవడం వల్ల ఈ ఆలయంలో వెలసిన స్వామివారిని కదిలే శివలింగం అని కూడా పిలుస్తారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment