అమ్మవారికి నూడుల్స్‌ నైవేద్యంగా పెట్టే ఆలయం.. ఎక్కడ ఉందో తెలుసా ?

September 21, 2021 6:29 PM

సాధారణంగా మనం ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ వివిధ రకాల పదార్థాలను, పండ్లను నైవేద్యంగా పెడుతుంటారు. ఎన్నో రకాల తీపి పదార్థాలను తయారు చేసి ముందుగా స్వామివారికి నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. అయితే మీరు ఎప్పుడైనా స్వామివారికి నైవేద్యంగా న్యూడిల్స్ పెట్టడం విన్నారా ? వినడానికి ఎంతో ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. కోల్‌కతాలోని చైనా టౌన్‌ (China Town)లో తంగ్రా అనే ప్రాంతానికి వెళితే అక్కడ ఉన్న కాళీమాత ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా నూడుల్స్ పెట్టడం మనం చూడవచ్చు.

అమ్మవారికి నూడుల్స్‌ నైవేద్యంగా పెట్టే ఆలయం.. ఎక్కడ ఉందో తెలుసా ?

అసలు ఈ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా నూడుల్స్ పెట్టడం ఏంటి అనే విషయానికి వస్తే.. కోల్‌కతాలోని చైనా టౌన్‌కి వెళితే మనం మన దేశం వదిలి చైనాలోకి వెళ్ళిన అనుభూతి కలుగుతుంది. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఎక్కువగా చైనీయులు స్థిరపడి ఉన్నారు. ఇక్కడ వెలసినటువంటి అమ్మవారి ఆలయం విషయానికి వస్తే 60 సంవత్సరాల క్రితం ఒక చెట్టు కింద రెండు విగ్రహాలు ఉండటంతో ప్రజలు ఆ విగ్రహాలకు పూజ చేసేవారు. అయితే రాను రాను ఈ ప్రాంతవాసులు విగ్రహాలకు ఆలయం నిర్మించి ఈ ఆలయంలో అమ్మవారికి పెద్ద ఎత్తున పూజలు చేసేవారు.

అయితే ఈ ప్రాంతంలో ఎక్కువగా చైనీయులు ఉండటం వల్ల అమ్మ వారికి ముందుగా నైవేద్యంగా నూడుల్స్ సమర్పించిన తరువాతనే భక్తులకు ప్రసాదంగా పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. అయితే అమ్మవారి ఆలయాన్ని దర్శించడం కోసం ఎంతో మంది భక్తులు వస్తున్నప్పటికీ అమ్మవారికి నైవేద్యంగా నూడుల్స్ సమర్పించనిదే పూజలు చేయరు. ఇక్కడ అమ్మవారికి కేవలం నూడుల్స్ మాత్రమే కాకుండా చాప్ సుయ్, స్టిక్కీ రైస్ వంటివి కూడా ప్రసాదంగా భక్తులకు పెడతారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment