పూజకు ఉపయోగించే పూలు, కొబ్బరికాయ, అగర్ బత్తీలు, కర్పూరం లాంటి వస్తువలను కింద పెట్టము. ఒక వేళ కింద పెడితే వాటిని పూజకు ఉపయోగించం. అలా ఉపయోగిస్తే అశుభం జరుగుతుందని నమ్ముతారు. వీటితో పాటు ఎట్టి పరిస్థితుల్లోనూ కొన్ని వస్తువులను కింద పెట్టకూడదు. అలా పెడితే అంతా అశుభమే జరుగుతుందని నమ్మకం. ఇంతకీ అస్సలు కింద పెట్టకూడని ఆ 5 వస్తువులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
హిందువుల్లో చాలా మందికి జంధ్యం ధరించే ఆచారం ఉంటుంది. అయితే దాన్ని నేలపై మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టరాదు. తల్లిదండ్రులు, గురువులకు ప్రతి రూపంగా దాన్ని భావిస్తారట. ఈ క్రమంలో జంధ్యంను కింద పెడితే వారిని అవమానించినట్టే అవుతుందట. అందుకని దాన్ని ఎప్పుడూ నేలపై పెట్టకూడదు. అలాగే బంగారాన్ని సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా చూస్తాం. అలాంటి బంగారాన్ని నేలపై పెడితే లక్ష్మీదేవి ఆగ్రహానికి లోనై అనేక కష్టాలు పడతారు. అలా చేస్తే వారి వద్ద ధనం నిలవదట. అన్నీ సమస్యలే వస్తాయట. కనుక బంగారాన్ని కూడా నేలపై నేరుగా పెట్టరాదు.
శివలింగాన్ని నేలపై అస్సలు పెట్టకూడదు. అలా చేస్తే అన్నీ సమస్యలే ఎదురవుతాయట. ఒక వేళ నేలపై పెట్టాల్సి వస్తే చెక్కతో చేసిన శుభ్రమైన ఉపరితలంపై ఉంచాలట. దేవుడి ముందు పెట్టే దీపాలను నేల మీద ఎట్టి పరిస్థితిలోనూ పెట్టరాదు. వాటిని వెలిగించినా, వెలిగించకపోయినా ఎల్లప్పుడూ వాటిని శుభ్రమైన వస్త్రంపైనే ఉంచాలి. ఇలా నేలపై పెట్టరాదు. అలా చేస్తే దేవుళ్లు, దేవతలను అవమానించినట్టే అవుతుందట. ఇక శంఖువులో సాక్షాత్తూ లక్ష్మీ దేవి కొలువై ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా నేలపై పెట్టరాదు. పెడితే ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. కనుక ఈ వస్తువులను నేలపై నేరుగా పెట్టరాదు. ఏదైనా శుభ్రమైన ఉపరితలంపై పెట్టవచ్చు. దీంతో ఎలాంటి అశుభాలు, నష్టాలు జరగకుండా నివారించవచ్చు.
ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్‌లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…