Lord Shiva : కార్తీక మాసంలో పొర‌పాటున కూడా ఈ త‌ప్పుల‌ను చేయ‌కండి..!

November 2, 2023 2:43 PM

Lord Shiva : కార్తీక మాసం వచ్చిందంటే చాలు. ప్రతి ఒక్కరూ కూడా, ఆ నెల అంతా కూడా పరమశివుడుని, ఎంతో భక్తితో కొలుస్తారు. 12 మాసాల్లో, ఈ మాసం ఎంతో ప్రత్యేకమైనది. హిందువులు ఎంతో పవిత్రంగా కార్తీక మాసాన్ని భావించి, నిష్టతో పరమశివుడికి పూజలు చేస్తూ ఉంటారు. శివుడు అనుగ్రహం కలగాలని, శివుడుని ఇలా నిష్టతో పూజిస్తే, ఆయన కటాక్షం పొందవచ్చని హిందువుల నమ్మకం. అందుకనే, కార్తీక మాసంలో కచ్చితంగా అందరూ శివుడుని పూజిస్తూ ఉంటారు. కార్తీకమాసంలో శివాలయాలు అసలు ఖాళీగా ఉండవు.

తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానాలు చేసి, పూజ మందిరంలో పూజలు చేసి, అలానే తులసి చెట్టుకి దీపారాధన చేసి, ఇలా ఎన్నో పద్ధతుల్ని పాటిస్తూ ఉంటారు. అలానే, దగ్గరలో ఉన్న ఏదైనా ఆలయం లేదంటే శివాలయానికి వెళ్లి, అభిషేకాలను కూడా జరిపిస్తూ ఉంటారు. శివుడు అభిషేక ప్రియుడు. అందుకని పరమశివుడికి అభిషేకాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అభిషేకం చేయించుకుంటే, ఎలాంటి దోషాలు ఉన్నా కూడా తొలగి పోతాయట. అదృష్టం కూడా కలుగుతుంది.

do not make these mistakes in karthika masam Lord Shiva
Lord Shiva

ఈ సంవత్సరం కార్తీకమాసం నవంబర్ 14 మంగళవారం నుండి మొదలవుతుంది. ఆ రోజు నుండి కూడా, మహిళలందరూ పరమ శివుడిని ప్రత్యేకించి ఆరాధిస్తూ ఉంటారు. కేవలం శాఖాహారం మాత్రమే ఈ నెల అంతా తీసుకోవాలి. ఉల్లి, గుమ్మడికాయ, వెల్లుల్లి, ముల్లంగి వంటివి తీసుకోకూడదు.

పెసరపప్పు, శనగ పప్పు, నువ్వులు కూడా తీసుకోకూడదు. కొబ్బరి, ఉసిరి వంటి పదార్థాలని ఆదివారం నాడు, కార్తీకమాసంలో తీసుకోకూడదు. స్నానం చేసేటప్పుడు, నలుగు పెట్టుకోకూడదు. ఇలా, కార్తీక మాసంలో పాటించాల్సిన నియమాలని కచ్చితంగా పాటిస్తూ, పరమశివుడిని కనుక భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే, కచ్చితంగా మంచి జరుగుతుంది. అలానే, అనుకున్న కోరికలని కూడా, శివుడు తీరుస్తారు. బాధాలేమీ కూడా వుండవు. సంతోషంగా ఉండవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now