Budha : బుద్ధుడి త‌ల‌పై ఉండే రింగుల జుట్టు వెనుక ర‌హ‌స్యం ఇదే..!

August 31, 2023 10:01 AM

Budha : పురాణాల ప్రకారం చూసినట్లయితే గౌతమ బుద్ధుడు శ్రీమహావిష్ణువు తొమ్మిదవ అవతారం అని అంటారు. చాలామంది ఈ విషయాన్ని నమ్ముతారు. వైశాఖ పూర్ణిమ, బుద్ధ పూర్ణిమ నాడు బుద్ధుడు పుట్టాడని అంటారు. బుద్ధుని జీవితంలో వైశాఖ పూర్ణిమ మూడుసార్లు అత్యంత ప్రాముఖ్యత వహించిందిట. గౌతమ బుద్ధుని కాలంలోనే బోధి చెట్టుకి పూజ చేసే ఆచారం మొదలైంది. బుద్ధుడు బేతవన ప్రాంతంలో బస చేయడానికి వస్తున్నట్లు తెలిసి, అక్కడ ప్రజలు ఆయనని పూజించడానికి పూలను తీసుకొచ్చారు.

ఆ సమయంలో బుద్ధుడు అక్కడికి వెళ్లకుండా ఎక్కడికో వెళ్లిపోవడంతో, ఎంతసేపటికి రాకపోవడంతో అక్కడ ప్రజలు నిరుత్సాహపడ్డారు. ఆ పూలన్నీ కూడా వాడిపోయాయి. తర్వాత వచ్చిన బుద్ధుడికి ఆనంద పిండకుడు ఈ విషయాన్ని చెప్పాడు. బుద్ధుడు లేనప్పుడు పూజ చేసేందుకు ఏదైనా వస్తువుని పెట్టమని చెప్పారు. అప్పుడు ఆయన తన శరీర భాగాలకు పూజలు చేయొద్దని, బోధి చెట్టుకి పూజ చేయండి అని చెప్పారట. అలా బోధి చెట్టుని పూజించడం మొదలైంది. చరిత్ర ప్రకారం చూసుకున్నట్లయితే గౌతమ బుద్ధుని తలమీద జుట్టు ఉండదు.

Budha head hair secret do you know about it
Budha

బుద్ధుని ఫోటోల‌లో చూసినట్లయితే, రింగు రింగులు జుట్టు కనబడుతూ ఉంటుంది. అందరూ రింగు రింగులు జుట్టు ఆయనకి ఉందేమో అనుకుంటారు. కానీ అవి వెంట్రుకలు కావు. బుద్ధుని తల మీద ఉండేది చనిపోయిన 108 నత్తలు. ఒకరోజు బుద్ధుడు ధ్యానం చేసుకుంటున్నప్పుడు, నత్త బుద్ధుడిని చూసింది. అయితే, సూర్యకిరణాల వలన ఎక్కడ బుద్ధుడి ధ్యానంకి భంగం కలుగుతుందో అని తల మీద ఎక్కింది. తన శరీరంలో ఉండే జలంతో బుద్ధుడి తలను చల్లగా మార్చింది నత్త.

ఈ నత్త చేసినట్లుగా ఇంకొన్ని నత్తలు కూడా చేశాయి. ఇవన్నీ బుద్ధుడి తల మీద చేరి ధ్యానానికి భంగం కలగకుండా, సహాయం చేస్తాయి. సూర్యుని వేడిని బుద్ధుడికి తగలకూడదని, ఇలా నత్తలు చేశాయి. కొన్ని గంటలపాటు అలానే ఉన్నాయి, ఆ తర్వాత నీరసం వచ్చి పడిపోయాయి ఆ నత్తలు. దీంతో అన్ని చనిపోయాయి. బుద్ధుడు ధ్యానం సాయంత్రానికి ముగిసింది. అప్పుడు చూసేసరికి తల మీద 108 నత్తలు చనిపోయి ఉన్నాయి. వాటి త్యాగాన్ని గుర్తు చేస్తూ, బుద్ధుడి విగ్రహాల మీద నత్తలు ఉంటాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment