Birth Hair Removal : హిందూ సాంప్రదాయంలో పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయడం ఎప్పటి నుంచో ఉంది. అధిక శాతం మంది తమకు దేవుడి మొక్కు ఉందని చెప్పి చిన్నారులకు పుట్టు వెంట్రుకలను తీస్తారు. అయితే ఇదే విధానం ఇతర మతాలు, కులాలకు చెందిన వర్గీయుల్లోనూ ఉంది. వారంతా రక రకాలుగా ఈ ఆచారాన్ని పాటిస్తారు. అయితే ఇలా పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయడంలో మాత్రం పలు ఆసక్తికర విషయాలు దాగి ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వేదాల ప్రకారం చిన్నారులకు మొదటి లేదా 3వ సంవత్సంలో పుట్టు వెంట్రుకలను తీయాలి. అలా కాకుండా చేస్తే అది పెద్ద తప్పవుతుంది. అంతే కాదు పిల్లల చుట్టూ ఎల్లప్పుడూ దుష్టశక్తుల ప్రభావం ఉంటుంది.
పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీసే సమయంలో తల్లి తరపు తాత, అమ్మమ్మ దగ్గర ఉండకూడదని అనేక మంది భావిస్తారు. ఎందుకంటే ఇది పిల్లలకు దురదృష్టాన్ని కలిగిస్తుందట. కొన్ని వర్గాల్లో తండ్రి తరపు సోదరి పిల్లలను పుట్టు వెంట్రుకలు తీయించేందుకు తీసుకెళ్లే ఆచారం ఉంది. ఆ పిల్లలకు పేరు పెట్టేందుకు కూడా వారికి అధికారం ఉంటుంది. తల్లి గర్భంలో ఉండగానే చిన్నారులకు వెంట్రుకలు పెరుగుతాయి. చిన్నారి తలపై వెంట్రుకలు ఉంటే అది వారి అభివృద్ధికి అడ్డుగా నిలుస్తుందని పురాతన కాలంలో నమ్మేవారు. ఈ నేపథ్యంలోనే దుష్ట శక్తుల బారి నుంచి రక్షించేందుకు చిన్నారులకు పుట్టు వెంట్రుకలను తీయించేవారు. ఇది పిల్లలకు మానసిక, ఆధ్యాత్మిక శక్తిని ఇస్తుంది. అంతేకాదు వారి అభివృద్ధికి కూడా తోడ్పడుతుంది.
పిల్లలకు తరచూ గుండు గీయిస్తే వెంట్రుకలు త్వరగా పెరగడంతోపాటు అవి దృఢంగా మారతాయని అనేక మంది నమ్ముతారు. కానీ ఇందులో ఎంతమాత్రం నిజం లేదని పరిశోధకులు చెబుతున్నారు. వెంట్రుకలను తీసిన తరువాత వాటిని అలాగే పడేయవద్దని హిందువులు నమ్ముతారు. వాటిని గంగలో లేదా దాని ఉపనదుల్లో కలిపితేనే చేసిన పనికి సార్థకత లభిస్తుందని వారి విశ్వాసం. పుట్టు వెంట్రుకలను తీయించకపోతే చిన్నారులపై ఇతరుల దిష్టి ప్రభావం పడుతుందని విశ్వసిస్తారు.
బాలురు, బాలికలకు పుట్టు వెంట్రుకలను భిన్న రకాలుగా తీస్తారు. బాలికలకైతే తలపై వెంట్రుకలను పూర్తిగా తీస్తారు. అదే బాలురకైతే పిలకలాగా కొన్ని వెంట్రుకలను అలాగే ఉంచుతారు. పుట్టు వెంట్రుకల తంతు ముగిసిన తరువాత చిన్నారి తలపై పసుపు లేదా చందనం మిశ్రమాన్ని పూతగా పూస్తారు. దీంతో చిన్నారి పరిశుద్ధమవుతుంది.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…