Anna Danam : చాలామంది పుణ్యం కలగాలని, మంచి జరగాలని అనేక రకాల దానాలని చేస్తూ ఉంటారు. అయితే అన్ని దానాల కంటే కూడా అన్నదానం గొప్పది అని మీరు చాలా సార్లు వినే ఉంటారు. నిజానికి హిందూ సాంప్రదాయం ప్రకారం అన్ని దానాల కంటే కూడా అన్నదానం ఎంతో గొప్పది. ఒక పూట ఎవరికైనా భోజనం పెడితే చాలా చక్కటి ఫలితం కనబడుతుంది. అందుకే అన్నదానం అన్ని దానాల కంటే కూడా గొప్పదని అంటారు.
మరి అన్నదానం యొక్క విశిష్టత అంటే ఏమిటి..?, దాని ప్రాధాన్యత ఏంటి.. అనే వివరాలని మనం తెలుసుకుందాం. ఎన్ని ధర్మాలు చేసినా, ఎవరికి ఎన్ని ఇచ్చినా, ఇంకా ఇంకా ఏమిచ్చినా కూడా కావాలని అంటూ ఉంటారు. కానీ అన్న దానం చేస్తే ఇంకా ఇంకా కావాలని అడగరు. సంతృప్తి చెందుతారు. కానీ మిగిలిన ఏ దానాలు చేసినా కూడా వాళ్ళకి ఇంకా కావాలని అనిపిస్తూ ఉంటుంది.
వాళ్ళని అది సంతృప్తి పరచదు. కాబట్టి అన్ని దానాల కంటే అన్నదానం గొప్పదని అంటారు. పైగా అన్నం లేకుండా భూమి మీద ఏ ప్రాణి కూడా నివసించలేదు. మూడు పూటలా ఏ లోటు లేకుండా అన్నం దొరికితే మనకి చాలు. ఇక మనకి ఏమీ అక్కర్లేదు. పైగా మనం అన్నం తీసుకున్న ప్రతి సారి కూడా అన్నపూర్ణా దేవిని తలుచుకుంటూ ఉంటాము.
ఏ దానం చేసినా కూడా మనస్ఫూర్తిగా ఎలాంటి స్వార్థం లేకుండా చేయాలి. గోదానం, వస్త్ర దానం, కన్యాదానం, భూదానం వంటివి కూడా ఎంతో విశిష్టమైనవి. ఎవరికైతే దాన గుణం ఉండదో వాళ్ళకి మోక్షం లభించదట. ఎలాంటి స్వార్థం లేకుండా ఎవరికైనా సహాయం చేస్తే మాత్రం చక్కటి ఫలితం కనబడుతుంది. ఆకలితో ఉన్నవాళ్ళకి, పేదలకు, లేదంటే అనారోగ్యం ఉన్నవాళ్లకి, వికలాంగులకి, అనాథలకి అన్నదానం చేస్తే చక్కటి ఫలితం కనిపిస్తుంది.
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…
అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు.…