Work From Home Scam : సోషల్ మీడియా ప్రభావం ప్రస్తుత తరుణంలో ఎంతగా ఉందో అందరికీ తెలిసిందే. అయితే దీన్ని ఆసరగా చేసుకుని చాలా మంది నెటిజన్లను మోసం చేస్తున్నారు. సింపుల్ టాస్కులను చేస్తే చాలు.. డబ్బులు వస్తాయని చెప్పి నమ్మిస్తున్నారు. లక్షల రూపాయలను ఇంట్లో కూర్చునే సంపాదించవచ్చని ఆశ పుట్టిస్తున్నారు. ఇది నిజమే అని నమ్మిన చాలా మంది ఇప్పటికే ఎన్నో కోట్ల రూపాయలను పోగొట్టుకున్నారు. అయినప్పటికీ కొందరు ఇంకా ఇలాంటి మాయగాళ్ల వలలో చిక్కుకుంటూనే ఉన్నారు. లక్షలాది రూపాయలను నష్టపోతున్నారు. ఇక తాజాగా ముంబైలో ఇలాంటిదే ఓ సంఘటన చోటు చేసుకుంది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
ముంబైకి చెందిన 37 ఏళ్ల ఓ మహిళ గర్భం ధరించి మెటర్నిటీ లీవ్‌లో ఉంది. ఆమె అక్కడి నవీ ముంబైలోని ఐరోలి అనే ప్రాంతంలో నివాసం ఉంటోంది. అయితే లీవ్‌లో ఉన్నప్పటికీ ఆన్‌లైన్ ద్వారా డబ్బులు సంపాదించే మార్గాల కోసం వెతకసాగింది. ఈ క్రమంలోనే ఆమె మాయగాళ్ల ట్రాప్‌లో పడింది. ఆమె కొందరిని సోషల్ మీడియా ద్వారా కాంటాక్ట్ అయింది. సింపుల్ టాస్కులను చేస్తే చాలు లక్షల రూపాయలు ఇస్తామని వారు నమ్మబలికారు. దీంతో ఆమె నిజమే అని నమ్మి పలు దఫాలుగా వారి అకౌంట్లలో మొత్తం రూ.54 లక్షలను జమ చేసింది. మొత్తం నలుగురికి చెందిన అకౌంట్లకు ఆమె నగదును ట్రాన్స్‌ఫర్ చేసింది.
ఆమె నగదు జమ చేశాక అవతలి వ్యక్తులు కొన్ని రోజుల పాటు పలు టాస్కులను ఇచ్చారు. రెస్టారెంట్లకు రేటింగ్స్ ఇస్తే భారీ ఎత్తున డబ్బు సంపాదించవచ్చని చెప్పారు. దీంతో ఆమె వారు చెప్పిన టాస్కులను పూర్తి చేసింది. అయితే చివరకు వారు స్పందించలేదు. దీంతో మోసపోయానని గ్రహించిన ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు పోలీసులు సదరు నలుగురు అపరిచిత వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే పోలీసులు ఇలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, చిన్న టాస్కులను చేస్తే లక్షల రూపాయలను సంపాదించవచ్చని ఎవరైనా చెబితే అసలు నమ్మవద్దని వారు చెబుతున్నారు.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…