భార్యా భర్తల మధ్య గొడవలు జరగడం సహజమే. అయితే ఆ గొడవలు కొంత సమయం అయితే సద్దు మణిగిపోతాయి. తర్వాత దంపతులు ఎప్పటిలాగే కలసి మెలసి ఉంటారు. కానీ ఆ వ్యక్తి మాత్రం అంతటితో శాంతించలేదు. భార్యతో గొడవపడి తీవ్ర ఆగ్రహావేశాలకు లోనై ఆమెను అతి దారుణంగా హత్య చేసి చంపేశాడు. వివరాల్లోకి వెళితే..
బెంగళూరుకు చెందిన కాంతరాజు (39) అనే వ్యక్తి స్థానికంగా ఫైనాన్షియర్‌గా జీవనం సాగిస్తున్నాడు. అతనికి రూప (34) అనే భార్య, 7 ఏళ్ల కుమారుడు ఉన్నారు. వీరు పశ్చిమ బెంగళూరులోని అన్నపూర్ణేశ్వరి నగర్‌లో నివాసం ఉంటున్నారు. అయితే శుక్రవారం సాయంత్రం 5.30 గంటల సమయంలో దంపతులిద్దరి మధ్య చిన్న గొడవ జరిగింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన కాంతరాజు ఆవేశం పట్టలేక పక్కనే ఉన్న ఓ ఐరన్ రాడ్ తీసుకుని ఆమె తలపై బలంగా బాదాడు. దీంతో ఆమె కింద పడిపోయింది.
ఆ తరువాత కాంతరాజు తన భార్య రూప మెడపై అతి కిరాతకంగా స్క్రూ డ్రైవర్, కత్తితో పొడిచి చంపేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే కాంతరాజు తండ్రి, సోదరుడు రూప హత్యపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు కేసు నమోదు చేసి కాంతరాజును అరెస్టు చేశారు. అయితే కాంత రాజుకు ఇప్పటికే 3 హత్యలతో ప్రమేయం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో పాత కేసులను కూడా విచారిస్తున్నామని వారు తెలిపారు.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…