అత్యంత దారుణ‌మైన ఘ‌ట‌న‌.. భార్య‌తో గొడ‌వ‌ప‌డి.. 3 నెల‌ల పసికందును చిదిమేశాడు..

December 9, 2021 4:58 PM

ఢిల్లీలో అత్యంత దారుణ‌మైన ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఓ వ్య‌క్తి భార్య‌తో గొడ‌వ‌ప‌డి త‌న 3 నెల‌ల ప‌సికందును చిదిమేశాడు. ఢిల్లీలోని స‌మ‌తా విహార్‌లో ఈ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్ర‌కారం.. ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించి వివ‌రాలు ఈ విధంగా ఉన్నాయి.

man killed his 3 months old baby boy by quarreling with his wife

ఢిల్లీలోని స‌మ‌తా విహార్‌లో నివాసం ఉంటున్న ర‌వి రాయ్ (26) గ‌త కొంత కాలంగా ఎలాంటి ప‌నిచేయ‌కుండా ఖాళీగానే ఇంట్లో ఉంటున్నాడు. అత‌ని భార్య స‌మీపంలో ఉన్న ఆదాజ్‌పూర్ మండీలో ఉద్యోగం చేస్తోంది. అయితే వారు స‌మ‌తా విహార్‌కు ఒక నెల కింద‌టే వ‌చ్చారు.

ఏ ప‌ని చేయ‌కుండా ఇంట్లో ఎన్ని రోజులు ఖాళీగా ఉంటావు, ఉద్యోగం వెదుక్కోమ‌ని భార్య రోజూ చెబుతుండేది. దీంతో ఇద్ద‌రికీ కొంత కాలంగా రోజూ గొడ‌వ‌లు అవుతుండేవి. ఈ క్ర‌మంలోనే తాజాగా మ‌రోమారు వీరు గొడ‌వ‌ప‌డ్డారు. అయితే ప‌ట్ట‌రాని కోపం వ‌చ్చిన ర‌వి త‌న 3 నెల‌ల కుమారున్ని గోడ‌కేసి బ‌లంగా కొట్టాడు.

ఈ క్ర‌మంలో ఆ ప‌సికందు త‌లకు తీవ్ర‌మైన గాయాల‌య్యాయి. త‌ల్లి ఇరుగు పొరుగు స‌హాయంతో హాస్పిట‌ల్‌కు తీసుకెళ్లింది. అయితే అప్ప‌టికే ఆ చిన్నారి మృతి చెందాడ‌ని వైద్యులు తెలిపారు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయ‌గా.. వారు కేసు న‌మోదు చేసి ర‌వి రాయ్‌ని అరెస్టు చేసి రిమాండ్‌కు త‌ర‌లించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now