Cyber Cheating : సైబ‌ర్‌ మోసం.. రూ.27 ల‌క్ష‌లు కోల్పోయిన హైద‌రాబాద్‌ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని..

January 15, 2026 9:13 PM

Cyber Cheating : సైబ‌ర్ నేర‌గాళ్లు కొత్త కొత్త మార్గాల్లో మోసాలు చేస్తున్నార‌ని, ఇలాంటి వారి ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని పోలీసులు ఓ వైపు ఎంత చెబుతున్నా కూడా కొంద‌రు వ్య‌క్తులు ఇంకా అప‌రిచితులను న‌మ్మి మోస‌పోతూనే ఉన్నారు. తాజాగా హైద‌రాబాద్‌లో ఇలాంటిదే ఓ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. సోష‌ల్ మీడియాలో ప‌రిచ‌యం అయిన ఓ వ్య‌క్తిని నమ్మిన ఆ యువ‌తి ఏకంగా ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను పోగొట్టుకొంది. ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించి వివ‌రాల్లోకి వెళితే..

హైద‌రాబాద్‌కు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగినికి ఇటీవ‌లే ఫేస్‌బుక్‌లో ఓ వ్య‌క్తి పరిచ‌యం అయ్యాడు. అత‌డు త‌న‌ను తాను నితిన్ ప‌టేల్‌గా ప‌రిచ‌యం చేసుకున్నాడు. తాను యూకేలో ఉంటున్నాన‌ని, బ్రిటిష్ ఎయిర్‌వేస్‌లో పైల‌ట్‌గా ప‌నిచేస్తున్నాన‌ని న‌మ్మ‌బ‌లికాడు. అయితే అత‌నితో ఆమె స్నేహం చేసింది. ఆమె వివ‌రాల‌ను రాబ‌ట్టిన అత‌ను ఆమెకు ఓ పార్సిల్ పంపించాడు.

Cyber Cheating it girl from hyderabad lost rs 27 lakhs
Cyber Cheating

అయితే ఆ పార్సిల్ లాజిస్టిక్స్ వారి వ‌ద్ద ఆగిపోయింద‌ని, క‌స్ట‌మ్స్ ఫీజు చెల్లించాల‌ని ఓ యువ‌తి ఆ ఉద్యోగినికి ఫోన్ కాల్ చేసింది. అది నిజ‌మే అని న‌మ్మిన ఆ ఉద్యోగిని ముందుగా రూ.55వేల‌ను చెల్లించింది. అయితే ఆమె నుంచి విడ‌త‌ల వారిగా అవ‌త‌లి వారు అలా డ‌బ్బు వ‌సూలు చేస్తూనే ఉన్నారు. దీంతో మొత్తం ఆమె వారికి రూ.27 ల‌క్ష‌ల‌ను అలా చెల్లించింది. అయితే చివ‌ర‌కు తాను మోస‌పోయాన‌ని ఆమె గ్ర‌హించి స్థానిక పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేయ‌డంతోపాటు సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌కు కూడా ఫిర్యాదు చేసింది.

సోష‌ల్ మీడియాలో అప‌రిచిత వ్య‌క్తుల‌తో ఎట్టి ప‌రిస్థితిలోనూ స్నేహం చేయ‌వ‌ద్ద‌ని, సైబ‌ర్ మోసాలు పెరిగిపోతున్నాయ‌ని, క‌నుక ఇలాంటి వాటి ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని పోలీసులు హెచ్చ‌రిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now