అప్పుడే తన భార్య ఫోన్ చేసి ఇంటికి రావడానికి ఆలస్యం అవుతుందా అని తన భర్తను అడగగా.. మరో పది నిమిషాల్లో ఇంటికి వస్తానని ఆ భర్త సమాధానం చెప్పాడు. పది నిమిషాల్లో వస్తానన్న భర్త ఎంతసేపటికీ రాకపోగా పోలీసులు ఆమె ఇంటి తలుపు తట్టారు. ఏమైందో అని కంగారు పడుతున్న సమయంలో తన భర్త మృతదేహాన్ని ఇవ్వడంతో సదరు మహిళ అక్కడే కుప్పకూలిపోయింది ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నగరంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
పని నిమిత్తం బయటకు వెళ్లిన భర్తకి భార్య ఫోన్ చేసి ఇంకా ఇంటికి రాలేదేమిటి ? ఆలస్యం అవుతుందా ? అని అడిగింది. అందుకు అతను.. బయలుదేరుతున్నానని, 10 నిమిషాల్లో ఇంట్లో ఉంటానని చెప్పాడు. అయితే అతను అక్కడి నుంచి బయలుదేరే సమయానికి పెద్ద ఎత్తున వర్షం కురిసింది. దీంతో బస్ స్టాప్ సమీపంలో తన సైకిల్ పెట్టి అక్కడే ఉన్న హోర్డింగ్ బోర్డుకు చేయి ఆనించి నిలబడ్డాడు. అలా నిలబడిన వ్యక్తి ఉన్న పళంగా కుప్పకూలి పడిపోయాడు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడ పడి ఉన్న వ్యక్తిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. వర్షం పడుతుండడం వల్ల హోర్డింగ్ బోర్డుకు విద్యుత్ ప్రసారం కావడం చేత అతడు విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడని పోలీసులు వెల్లడించారు. కేవలం మున్సిపాలిటీ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఈ విధమైన ఘటన చోటుచేసుకుందని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ కన్నీరు మున్నీరవుతున్నారు.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…