క్రైమ్‌

దారుణం: కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్న బాలిక

కేవలం ఫోన్ లో ఎక్కువగా మాట్లాడొద్దని తన తల్లి కూతురిని హెచ్చరించేందుకుగాను ఆ కూతురు తల్లికి కడుపుకోతను మిగిల్చింది. కేవలం తన తల్లిదండ్రులు తనని మందలించారన్న కోపంతోనే ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఘట్ కేసర్ సమీపంలో చోటు చేసుకుంది. ఘట్ కేసర్ సీఐ చంద్రబాబు తెలిపిన వివరాల మేరకు..

మహబూబ్‌నగర్‌ జిల్లా ఉంద్యాల్‌ గ్రామానికి చెందిన జమ్మికుంట విష్ణు, పద్మ దంపతుల ఒక కుమార్తె కుమారుడు కలరు. వీరు అన్నోజీగూడ రాజీవ్‌ గృహకల్పలో నివసిస్తున్నారు. విష్ణు హోంగార్డ్ గా విధులు నిర్వహిస్తున్నారు. తన కూతురు స్రవంతి పదవ తరగతి పూర్తి చేసింది. అయితే ప్రస్తుతం కాలేజీలు లేకపోవడంతో ఇంటిపట్టునే ఉన్న స్రవంతి ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఫోన్లో మాట్లాడుతూ గడిపేది.ఈ క్రమంలోనే తన తల్లిదండ్రులు తనని ఫోన్లో మాట్లాడడం తగ్గించమని చెప్పారు. అయినప్పటికీ తన పద్ధతి మార్చుకోక పోవడంతో శుక్రవారం రాత్రి తన తల్లిదండ్రులు గట్టిగా మందలించారు.

ఈ విధంగా తల్లిదండ్రులు మందలించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన స్రవంతి శుక్రవారం రాత్రి పడుకున్న సమయంలో కిరోసిన్ డబ్బా చేతపట్టుకొని తల్లిదండ్రులు బయటకు రాకుండా తలుపు బయట గడియ పెట్టి సమీప కాళీ ప్రదేశంలో కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. మరుసటి రోజు ఉదయం వాకింగ్ వెళ్లిన స్థానికులు సగం కాలిన మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలోనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనా స్థలానికి డాగ్, క్లూస్‌ టీంలు చేరుకొని ఆధారాలు సేకరించారు. పోలీసులు ఘటన స్థలం వద్ద సెల్ ఫోన్‌‌‌‌ స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలోనే అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

రిస్క్ చేస్తేనే మంచి సినిమా.. ‘డెకాయిట్’ క్లైమాక్స్‌పై నిర్మాత సుప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు!

మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేన‌ని నిర్మాత సుప్రియ యార్ల‌గ‌డ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీల‌క‌మ‌ని, ఇప్పుడు ప్రేక్ష‌కులు…

Tuesday, 14 April 2026, 7:27 PM

ఐపీఎల్ జట్టు ఎందుకు కొనలేదు? అసలు నిజం చెప్పిన అభిషేక్ బచ్చన్.. అంత బడ్జెట్ నా దగ్గర లేదు!

నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…

Tuesday, 14 April 2026, 5:35 PM

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి అంటే?

ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధ‌మైంది. ఈ…

Tuesday, 14 April 2026, 3:21 PM

పాత ఫ్లాపులని గుర్తు చేస్తూ ట్రోల్ చేస్తే బాధగా ఉంటుంది.. కృతి శెట్టి ఎమోషనల్ కామెంట్స్!

తాను గ‌తంలో చేసిన సినిమాలు చాలా వ‌ర‌కు ఫ్లాప్ అయ్యాయి క‌నుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…

Saturday, 11 April 2026, 8:35 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్‌పై చిరంజీవి ఎమోషనల్.. పరిశ్రమకు ఇది పెద్ద దెబ్బ అంటూ ఆవేదన!

తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన‌ చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంట‌ర్నెట్‌లో…

Friday, 10 April 2026, 6:40 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్.. 5 నిమిషాల యాక్షన్ సీన్ నెట్టింట వైరల్! షాక్‌లో చిత్ర యూనిట్..

తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…

Friday, 10 April 2026, 12:43 PM

ప్రొపగాండా అంటే ఏంటి? ‘ధురంధర్ 2’ విమర్శకులపై సందీప్ రెడ్డి వంగా నిప్పులు!

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధ‌ర్ 2 ది…

Thursday, 9 April 2026, 11:07 PM

‘కిల్లర్’ మిల్లర్ ఇప్పుడు విలన్ అయ్యాడా? డీసీ ఓటమిపై సునీల్ గవాస్కర్ సంచలన విశ్లేషణ..

ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…

Thursday, 9 April 2026, 9:01 PM