---Advertisement---

కూ.3 కోట్ల‌తో కొడుక్కి ల‌గ్జ‌రీ కారు గిఫ్ట్‌.. స్ప‌ష్ట‌త‌నిచ్చిన సోనూసూద్‌..!

June 21, 2021 1:24 PM
---Advertisement---

కరోనా నేప‌థ్యంలో బాధితుల‌కు న‌టుడు సోనూసూద్ ఏ విధంగా స‌హాయం చేస్తున్నాడో అంద‌రికీ తెలిసిందే. అయితే బ‌య‌టి వారికే అంత చేసిన వాడు త‌న కుమారుడిని ఏవిధంగా చూసుకుంటాడో అర్థం చేసుకోవ‌చ్చు. అందుక‌నే సోనూసూద్ త‌న కొడుక్కి ఏకంగా రూ.3 కోట్ల విలువైన ఓ లగ్జ‌రీ కారును గిఫ్ట్‌గా అందించాడ‌నే ఓ వార్త ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతోంది. అయితే దీనిపై సోనూసూద్ స్పందించాడు.

sonu sood given rs 3 crore car gift to his son clarified by sonusood

ఫాదార్స్ డే సంద‌ర్భంగా త‌న కుమారుడు ఇషాన్‌కు రూ.3 కోట్ల విలువైన ల‌గ్జ‌రీ కారును గిఫ్ట్‌గా ఇచ్చాడు.. అన్న వార్త‌ల‌పై స్పందించిన సోనూసూద్ మాట్లాడుతూ కారును ట్ర‌య‌ల్ వేసేందుకు ఇంటికి తీసుకొచ్చిన మాట వాస్త‌వ‌మే కానీ.. దాన్ని త‌న కొడుక్కి గిఫ్ట్‌గా ఇవ్వ‌లేద‌ని సోనూసూద్ తెలిపాడు.

అయినా ఫాద‌ర్స్ డే సంద‌ర్భంగా త‌నకే త‌న కొడుకు గిఫ్ట్‌లు ఇవ్వాలి కానీ.. తాను త‌న కొడుక్కి ఎలా గిఫ్ట్ ఇస్తాన‌ని సోనూ అన్నాడు. అయితే ఈ వార్త వైర‌ల్ అయిన‌ప్ప‌టికీ చాలా మంది త‌న‌కు మ‌ద్ద‌తు ఇస్తూ మాట్లాడ‌డం సంతోషంగా ఉంద‌ని సోనూసూద్ తెలిపాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now