అతని ప్రేమలో నటి శ్రద్ధా కపూర్..?

June 27, 2021 8:49 PM

బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ ప్రేమలో నటి శ్రద్ధా కపూర్ పడబోతోందా? అంటే అవుననే అంటోంది బాలీవుడ్ ఇండస్ట్రీ. అయితే వీరిద్దరూ నిజజీవితంలో ప్రేమలో పడుతున్నారా.. అని అనుకుంటే మీరు పొరపాటు పడినట్టే. తాజాగా కార్తీక్ ఆర్యన్ హీరోగా ‘సత్యనారాయణ్‌ కీ కథ’. అనే చిత్రం తెరకెక్కబోతోందని ఇదివరకే ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే.

తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ సమాచారం బాలీవుడ్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.సాజిద్‌ నడియాడ్‌వాలా నిర్మించనున్న ఈ చిత్రంలో కార్తీక్ సరసన కథానాయిక ఎవరు అనే విషయంపై స్పష్టత వచ్చింది. ఈ సినిమాలో కార్తీక్ సరసన నటి శ్రద్ధా కపూర్ అయితే బాగుంటుందని,వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న మొదటి చిత్రం కావడంతో ఈ పాత్రకు శ్రద్ధ కపూర్ సరిగ్గా సరిపోతారని చిత్ర బృందం భావించారు.

ఈ క్రమంలోనే ఈ సినిమా గురించి ఆమెతో సంప్రదింపులు జరిపగా, కథ నచ్చడంతో ఈ పాత్రలో నటించడానికి శ్రద్ధాకపూర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర చాలా కీలకమైనది. ఈ పాత్రకు శ్రద్ధ అయితేనే న్యాయం చేస్తుందని,సరికొత్త ప్రేమకథతో తెరకెక్కనున్న థ్రిల్లర్‌ చిత్రమిదని ఈ సందర్భంగా సాజిద్‌ నడియాడ్‌వాలా సన్నిహిత వర్గాలు చెప్పినట్టు సమాచారం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment