సినిమా

మ‌గ యాక్ట‌ర్లు పిల్ల‌ల్ని క‌న్నా యువ హీరోయిన్ల‌తో రొమాన్స్ చేయ‌వ‌చ్చు: అమృతా రావు

బాలీవుడ్ న‌టి అమృతా రావు సినీ ఇండ‌స్ట్రీలో ఉన్న పురుషాధిక్య‌త‌పై కామెంట్లు చేసింది. సినీ రంగంలో న‌టీమ‌ణులు వివ‌క్ష‌ను ఎదుర్కొంటార‌ని తెలిపింది. ఆడ‌వాళ్లు కావ‌డం వ‌ల్లే వారి సినీ కెరీర్‌పై ప్ర‌భావం ప‌డుతుంద‌ని, మ‌గ యాక్ట‌ర్ల కెరీర్‌పై పెళ్లి ఎలాంటి ప్ర‌భావం చూపింద‌ని ఆమె పేర్కొంది. మ‌గ యాక్ట‌ర్లు పెళ్లి చేసుకుని పిల్ల‌ల్ని క‌న్నా వారు యంగ్ హీరోయిన్ల‌తో సినిమాల్లో రొమాన్స్ చేస్తార‌ని చెప్పింది.

ఓ మీడియా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో అమృతారావు మాట్లాడుతూ సినీ రంగంలో పురుషుల‌కు ఏమీ కాద‌ని, కానీ స్త్రీల‌పై పెళ్లి ప్ర‌భావం చూపిస్తుంద‌ని, పురుషులు పెళ్లి చేసుకుని ఇద్ద‌రు పిల్ల‌ల‌ను క‌న్నా యువ హీరోయిన్ల‌తో రొమాన్స్ చేస్తార‌ని, కానీ స్త్రీల‌కు కెరీర్ ముగిసిపోతుంద‌ని అభిప్రాయ‌ప‌డింది. ఎంతో మంది ఈ ఇబ్బందుల‌ను ఎదుర్కొంటున్నార‌ని తెలిపింది.

1950 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఈ విధ‌మైన ట్రెండ్ కొన‌సాగుతుంద‌ని అమృతా రావు తెలియ‌జేసింది. కాగా అమృత చివ‌రిసారిగా థాక‌రే అనే మూవీలో మీనా అనే పాత్ర‌లో న‌వాజుద్దీన్ సిద్దికీ తో క‌లిసి న‌టించింది. 2019లో ఆ మూవీ విడుద‌లైంది. బాల్ థాక‌రే జీవిత చ‌రిత్ర ఆధారంగా ఆ మూవీని తీశారు. అమృత 2016లో త‌న లాంగ్ టైమ్ బాయ్ ఫ్రెండ్ అన్మోల్ సూద్‌ను వివాహం చేసుకుంది. అత‌ను ఆర్‌జే అన్మోల్‌గా అంద‌రికీ ప‌రిచ‌య‌మే. వారికి గ‌తేడాది న‌వంబ‌ర్ లో బాబు జ‌న్మించాడు. అత‌నికి వీర్ అని నామ‌క‌ర‌ణం చేశారు. తెలుగులో అమృత హీరో మ‌హేష్‌తో క‌లిసి అతిథి మూవీలో న‌టించింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

స్పూన్లు వద్దు.. చేత్తో తింటేనే ఆ మజా! అక్షయ్ కుమార్ డైట్ సీక్రెట్ వైరల్..

ఆరోగ్య‌క‌ర‌మైన జీవ‌న‌శైలిని పాటించ‌డ‌మే కాకుండా, రోజూ క‌ఠిన డైట్‌, వ్యాయామ నియ‌మాల‌ను పాటించ‌డంలో బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ ఎల్ల‌ప్పుడూ…

Saturday, 21 March 2026, 6:09 PM

సల్మాన్ ఖాన్ నా పట్ల ఎంతో సహనంతో ఉన్నారు.. ‘లక్కీ’ జ్ఞాపకాలను పంచుకున్న స్నేహ ఉల్లాల్!

అప్ప‌ట్లో బాలీవుడ్ న‌టుడు స‌ల్మాన్‌ఖాన్‌తో క‌లిసి ల‌క్కీ సినిమా చేసిన స‌మ‌యంలో చిత్ర షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు ఆయ‌న త‌న ప‌ట్ల…

Friday, 20 March 2026, 9:29 PM

రష్మికకు ‘గద్దర్’ అవార్డు.. రేవంత్ రెడ్డి, రామ్ చరణ్ చేతుల మీదుగా! ట్రోల్స్‌కు అదిరిపోయే రిటార్ట్.

టాలీవుడ్ న‌టుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను ఇటీవ‌లే వివాహం చేసుకున్న క‌న్న‌డ న‌టి ర‌ష్మిక మంద‌న్న‌కుతెలంగాణ గద్ద‌ర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో…

Friday, 20 March 2026, 7:49 PM

ఆ డాక్టర్లు డబ్బులిస్తామన్నా వద్దన్నా.. అనుపమ్ ఖేర్ ‘బట్టతల’ వెనుక అసలు రహస్యం!

హెయిర్ వీవింగ్ కంపెనీలు, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ డాక్ట‌ర్లు త‌న‌కు డ‌బ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నార‌ని, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవాల‌ని త‌ర‌చూ…

Thursday, 19 March 2026, 10:23 PM

చదువులో 80 రాలేదు.. కానీ కెప్టెన్‌గా 80% సక్సెస్! సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు.

స్కూల్‌, కాలేజీల్లో చ‌దివిన‌ప్పుడు ఎన్న‌డూ 80 శాతం మార్కుల‌ను దాట‌లేక‌పోయాన‌ని, కానీ భార‌త టీ20 జ‌ట్టు కెప్టెన్‌గా 80 శాతానికి…

Thursday, 19 March 2026, 6:36 PM

అనుష్క పెళ్లి వార్తలపై టీమ్ సీరియస్.. ఆ వార్తల్లో నిజం లేదు! ప్రచారం ఆపండి..

తాను పెళ్లి చేసుకోబోతున్నాన‌ని మీడియాతోపాటు సామాజిక మాధ్య‌మాల్లో వ్యాప్తి చెందుతున్న వార్త‌ల‌ను న‌టి అనుష్క శెట్టి ఖండించింది. ఈ మేర‌కు…

Thursday, 19 March 2026, 3:38 PM

అందుకే బాలీవుడ్‌ను వదిలేశా.. హాలీవుడ్ వెనుక అసలు నిజం చెప్పిన ప్రియాంక చోప్రా!

భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన సినిమాల్లో పరిమితులు ఉంటాయ‌ని, హాలీవుడ్‌లో సినిమాల విష‌యంలో ఎలాంటి ప‌రిమితులు ఉండ‌వ‌ని, అందుక‌నే అక్క‌డ…

Thursday, 19 March 2026, 11:09 AM

జడేజా దంపతుల కాళ్లకు మొక్కిన కుల్దీప్ యాదవ్.. లక్నో రిసెప్షన్‌లో ‘సంస్కారం’ చాటుకున్న స్పిన్నర్!

భార‌త క్రికెట్ జ‌ట్టు రిస్ట్ స్పిన్న‌ర్ కుల్దీప్ యాద‌వ్ త‌న బాల్య స్నేహితురాలు వంశికా చ‌ద్దాను వివాహం చేసుకున్న నేప‌థ్యంలో…

Wednesday, 18 March 2026, 8:13 PM