గత కొన్ని సంవత్సరాల క్రితం వరకు తెలుగు ఇండస్ట్రీలో ఒక ఊపు ఊపిన హీరోయిన్లలో గోవా బ్యూటీ ఇలియానా ఒకరు. తన అందచందాలతో, ఎంతమంది కుర్ర కారులను ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అప్పట్లో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న ఇలియానాకు ప్రస్తుతం అవకాశాలు లేకపోవడంతో సినిమాలకు దూరంగా ఉంటూ తన వ్యక్తిగత జీవితాన్ని ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు.
ఇలియానా తన ప్రియుడు ఆండ్రూ నీబోన్‌తో తన విలువైన సమయాన్ని గడుపుతూ, మరోవైపు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు దగ్గర అవుతుంటారు. ఈ క్రమంలోనే ఇలియానా తాజాగా ఒక ఫోటోను షేర్ చేశారు. ఈ ఫోటోలో ఇలియానా మెడలో ధరించిన స్పెషల్ లాకెట్ పై నెటిజన్లు దృష్టిసారించారు.
ఈమె ధరించిన లాకేట్ ఏ బ్రాండ్? దాని ప్రత్యేకత ఏమిటి? ఈ లాకెట్ వెనుక ఉన్న అర్థం ఏమిటంటూ పలువురు స్పందించారు.ఈవిల్ ఐ లాకెట్ ,మల్టీ స్టాండ్ ఉమెన్ లాకెట్స్ అంటూ బోలెడన్ని వెరైటీలు ఉండగా ఇలియానా ధరించిన లాకెట్ మాత్రం ఎంతో ప్రత్యేకంగా ఉండడంతో ప్రస్తుతం ఈమె ధరించిన లాకెట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా ఇలియానా, అభిషేక్ బచ్చన్ నటించిన ది బిగ్ బుల్ ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…