సినిమా

ఆ హీరో బాల్కనీ నుంచి డబ్బులు విసిరేవారు.. కమెడియన్ సంచలన వ్యాఖ్యలు!

వెండితెరపై ఎన్నో సినిమాలలో విభిన్న పాత్రల్లో నటించి రియల్ స్టార్ గా పేరు సంపాదించుకున్న నటుడు శ్రీహరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం వెండితెరపై మాత్రమే కాకుండా నిజ జీవితంలో కూడా ఎన్నో దానధర్మాలను,మంచి పనులను చేస్తూ అందరి మన్ననలను పొందిన స్వర్గీయ శ్రీహరి జీవితంలో డిస్కోశాంతి ని ప్రేమించి పెళ్లి చేసుకోవడం అప్పట్లో ఓ సంచలనం గా మారింది.

ఎన్నో సినిమాలలో నటుడిగా విలక్షణ నటుడిగా నటించిన శ్రీహరి మరణం ఇండస్ట్రీకి తీరని లోటుగా ఏర్పడింది.తాను బతికి ఉన్నప్పుడు తన ద్వారా ఎంతో లబ్ధి పొందిన వారు తన మరణానంతరం తన కుటుంబానికి ఏమాత్రం సహాయం చేయడానికి ముందుకు రాలేదని ఎన్నో సందర్భాలలో తన భార్య డిస్కోశాంతి ఎమోషనల్ అయిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే 30 ఇయర్స్ ఇండస్ట్రీ కమెడియన్ పృధ్విరాజ్ నటుడు శ్రీహరి గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈటీవీ లో ప్రసారమయ్యే క్యాష్ ప్రోగ్రామ్ కు వచ్చిన బెనర్జీ, పృథ్వీ, జ్యోతి, సుదర్శన్ షోలో భాగంగా స్వర్గీయ శ్రీహరి, ఉదయ్ కిరణ్ గురించి తలుచుకున్నారు. ఈ క్రమంలోనే కమెడియన్ పృథ్వి రాజ్ శ్రీహరి గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. శ్రీహరి ఎంతో మంచి మనసు కలిగిన వ్యక్తి అని ఆయన గొప్పతనం గురించి తెలియజేస్తూ శ్రీహరి నివాసం ఉంటున్న జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 ఇంటిలో ఉన్నప్పుడు తన ఇంటి ముందు ఎవరైనా నిలబడి కనిపిస్తే చాలు.. వెంటనే శ్రీహరి రాయికి డబ్బులు చుట్టి బాల్కనీలో నుంచి విసిరేవారు. ఆ డబ్బులు తీసుకున్న వారు ఆయనకు దండం పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయేవారు. ఈ విధంగా ఎంతోమందికి ఎంతో సహాయం చేసిన గొప్ప మనసున్న వ్యక్తి శ్రీహరి అని ఆయన గురించి తలచుకున్నారు.ఇక ఈ కార్యక్రమంలో భాగంగా వీరిమధ్య జరిగిన సరదా సన్నివేశాలకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

వింత రనౌట్ వివాదం.. పాక్ ప్లేయర్‌కు ఐసీసీ షాక్! ఆ తప్పు చేసినందుకు భారీ జరిమానా..

బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…

Saturday, 14 March 2026, 10:32 PM

2024 vs 2026.. ఏ వరల్డ్ కప్ విజయం గొప్పది? ఫ్యాన్స్ మధ్య ఆసక్తికర చర్చ!

భార‌త టీ20ఐ క్రికెట్ జ‌ట్టు టీ20 వ‌ర‌ల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావ‌స్తోంది. అయిన‌ప్ప‌టికీ…

Saturday, 14 March 2026, 8:31 PM

గ్యాస్, పెట్రోల్ కొరత రాదు.. కేంద్రం కీలక ప్రకటన! ఆ జలసంధి వద్ద టెన్షన్..

పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…

Saturday, 14 March 2026, 7:22 PM

అల్లు అర్జున్ ‘అల్లు సినిమాస్’ ప్రారంభం.. ‘వాల్ ఆఫ్ గ్రేట్స్’పై మొదలైన వివాదం!

హైదరాబాద్‌లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్‌గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…

Saturday, 14 March 2026, 5:49 PM

‘కాక్‌టెయిల్ 2’ రిలీజ్ డేట్ ఖరారు.. రష్మిక-షాహిద్-కృతి ఫస్ట్ లుక్ చూశారా?

ర‌ష్మిక మంద‌న్న‌, షాహిద్ కపూర్‌, కృతి స‌న‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న కాక్‌టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…

Saturday, 14 March 2026, 11:53 AM

వివాదాస్పద రనౌట్.. బంగ్లాదేశ్ vs పాకిస్థాన్ మ్యాచ్‌లో హైడ్రామా! ‘క్రికెట్ స్ఫూర్తి’ ఎక్కడ?

పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్‌గా…

Friday, 13 March 2026, 8:27 PM

సినిమాలకు సెన్సార్ బోర్డు కొత్త రూల్.. ఇక సబ్‌టైటిల్స్ తప్పనిసరి! మార్చి 15 నుంచి అమల్లోకి..

సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…

Friday, 13 March 2026, 5:41 PM

‘పిల్లలకు ఊపిరాడటం లేదు’.. ముంబై కాలుష్యంపై దీపికా పదుకొనె ఆందోళన! అధికారులకు ప్రశ్న.

ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…

Friday, 13 March 2026, 11:45 AM