నటి, యాంకర్ అనసూయ పెట్టే పోస్టులు ఎప్పుడూ సోషల్ మీడియాలో వివాదాస్పదం అవుతూనే ఉంటాయి. ఆమె సోషల్ మీడియాలో పెట్టే పోస్టులను లైక్ చేసే వారి కన్నా విమర్శించే వారే ఎక్కువగా ఉంటారు. దీంతో ఆమె వివాదాల్లో చిక్కుకుంటూనే ఉంటుంది. అయితే తాజాగా అనసూయ ఓ ఫొటోషూట్ చేసి ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. నెటిజన్లు ఆమెను విమర్శిస్తున్నారు.
అనసూయ నటించిన తాజా మూవీ థాంక్యూ బ్రదర్ మే 7వ తేదీన ఓటీటీలో విడుదల కానుంది. దీంతో ఆ మూవీ ప్రమోషన్లలో ఆమె బిజీగా ఉంది. అయితే మూవీ ప్రమోషన్ నేపథ్యంలో బ్లాక్ డ్రెస్‌తో ఆమె ఫొటోషూట్ చేసింది. తరువాత ఆ ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే ఆమె ఫొటోలపై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. ఆ ఫొటోల్లో ఆమె కురచ దుస్తులు ధరించి ఉండడంతో ఆమెను మళ్లీ టార్గెట్ చేశారు.
కరోనా నేపథ్యంలో చాలా మంది మాస్కులు లేకుండా తిరుగుతున్నారని, చాలా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారని, ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని ఇటీవలే ఆమె సోషల్ మీడియా ద్వారా పిలుపునిచ్చింది. అయితే దాన్ని ఉద్దేశించి తాజాగా ఆమె పెట్టిన ఫొటోలను చూసి నెటిజన్లు ఆమెపై కామెంట్లు చేస్తున్నారు. మాస్కులు ధరించాలని పిలుపునిచ్చావు సరే, బాగానే ఉంది, కానీ నువ్వు ప్యాంట్ వేసుకోవడం మరిచిపోయావా ? అంటూ వారు ఆమెను ప్రశ్నిస్తున్నారు. అయితే తనను విమర్శించే నెటిజన్లకు అనసూయ కూడా దీటుగానే జవాబు ఇస్తుంది. మరి ఇందుకు ఆమె ఏమని సమాధానం చెబుతుందో చూడాలి.
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…
తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంటర్నెట్‌లో…
తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…