టాలీవుడ్లో ప్రస్తుతం సుకుమార్-బన్నీ కాంబినేషన్‌లో తెరకెక్కతున్న పాన్ ఇండియా మూవీ “పుష్ప” లో రష్మిక హీరోయిన్‌గా నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. రష్మిక మందన నాగశౌర్య హీరోగా నటించిన “చలో” మూవీ ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. తరువాత గీతాగోవిందం, సరిలేరు నీకెవ్వరు, భీష్మ వంటి బ్లాక్ బస్టర్ మూవీలతో తెలుగు ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది.
కన్నడ బ్యూటీ రష్మిక సౌత్ ఇండియాలో అగ్ర కథానాయికగా కొనసాగుతూ అత్యధిక అభిమానులను సొంతం చేసుకున్న హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా హైదరాబాద్ కు చెందిన ఓ అభిమాని రష్మికను కలవడానికి ఏకంగా 900 కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్ళాడట. వివరాల్లోకి వెళితే. రష్మికకు వీరాభిమాని అయినా ఆకాశ్ త్రిపాఠి హైదరాబాద్ కు చెందిన వ్యక్తి .ఈయన తన అభిమాన హీరోయిన్ ను ఒక్కసారైనా కలిసి మాట్లాడాలని భావించి తన ప్రయాణాన్ని మొదలు పెట్టాడు.
ఆ అభిమాని గూగుల్ ద్వారా రష్మిక స్వస్థలం కర్ణాటకలోని కొడగు సమీపంలోని విరాజ్‌పేట అని తెలుసుకున్నాడు. రైల్లో మైసూరుకు చేరుకొని అక్కడినుంచి ఏదో ఒక వెహికల్ పట్టుకొని రష్మిక స్వస్థలానికి చేరుకున్నాడు. అయితే అక్కడికి చేరుకున్నాక హీరోయిన్ రష్మిక ఇల్లు ఎక్కడ అంటూ కనిపించిన ప్రతి ఒక్కరిని అడిగాడు. అతడి ప్రవర్తన తేడాగా అనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అతన్ని విచారించగా అసలు ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశాడు ఆ అభిమాని. ఈ విషయం విన్న పోలీసులు రష్మిక ప్రస్తుతం పలు సినిమాల షూటింగ్ కోసం ముంబై వెళ్లినదని చెప్పి అతనిని వెనుతిరిగి పంపించారు.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…